amp pages | Sakshi

సోమశిలలో నీరు దుర్వినియోగం కాలేదు

Published on Sat, 03/19/2016 - 03:48

 నెల్లూరు(పొగతోట): సోమశిల ప్రాజెక్ట్‌లో నీరు దుర్వినియోగం కాలేదని కలెక్టర్ జానకి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సోమశిల ప్రాజెక్ట్‌లో 26 టీఎంసీల నీరు దుర్వినియోగమైందని రైతు సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారని, ఈ విషయమై పత్రికల్లో వార్తలు సైతం ప్రచురితమయ్యాయని వివరించారు. రైతు సంఘాల నాయకులు సేకరించిన సమయంలో నీటి గణాంకాలు పూర్తి స్థాయిలో లేవన్నారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీరు, విడుదల, వస్తున్న నీటి గణాంకాలను పూర్తిగా పరిశీలించారని చెప్పారు. 26 టీఎంసీల నీరు దుర్వినియోగం కాలేదని, ప్రాజెక్ట్‌లోనే నిల్వ ఉన్నాయని తెలిపారు. గతేడాది డిసెంబర్ 12న ఐఏబీ సమావేశం జరిగిందని, అప్పటికి జిల్లాలో 68.9 టీఎంసీల నీరు నిల్వ ఉందని రైతు సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారన్నారు.

ఐఏబీ నాటికి 67.862 టీఎంసీల నీరు నిల్వ ఉందని, గత నెల 20 నాటికి 18 టీఎంసీల నీరు ఇన్‌ఫ్లో ఉందని తెలిపారన్నారు. 3.918 టీఎంసీల నీరు మాత్రమే ఇన్‌ఫ్లో వచ్చిందని, కండలేరు రిజర్వాయర్‌కు 7.348 టీఎంసీల నీటిని విడుదల చేస్తే, మూడు టీఎంసీలనే విడుదల చేశారని నాయకులు తెలిపారన్నారు. ఇలాంటి తేడాల వల్ల 26 టీఎంసీల నీరు దుర్వినియోగమైందని రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే సోమశిల ప్రాజెక్ట్‌లో 33 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉందన్నారు.

నాయకులు చెప్పిన దానికి రికార్డులను పరిశీలిస్తే ఒక టీఎంసీ నీరు మాత్రమే తేడా వస్తోందని, ఇది  ఆవిరి, వృథా కిందపోయి ఉంటుందని తెలిపారు. నాయకులు ఫిర్యాదు చేసిన వెంటనే రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించామని పేర్కొన్నారు. 4.32 లక్షల ఎకరాలకు 43.7 టీఎంసీల సాగునీటిని విడుదల చేయాలని ఐఏబీలో తీర్మానించి నివేదికలను ప్రభుత్వానికి పంపి అనుమతితో నీటిని విడుదల చేశామని పేర్కొన్నారు. సోమశిల ప్రాజెక్ట్‌లో ఈఈ 3.2 టీఎంసీల నీటిని గణాంకాల్లో తక్కువగా నమోదు చేశారని చెప్పా రు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌