amp pages | Sakshi

కమలోత్సాహం..!

Published on Mon, 12/09/2013 - 03:10

బీజేపీకి బూస్టింగ్ ఇచ్చిన ఉత్తరాది ఎన్నికల ఫలితాలు
 = యడ్డిని పార్టీలోకి చేర్చుకుంటే పూర్వవైభవం
 = రాష్ర్టంలో ‘అమ్‌ఆద్మీ పార్టీ’కి అందివచ్చిన అవకాశం
 = డీలా పడిన హస్తం

 
సాక్షి, బెంగళూరు : ఢిల్లీ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ, అమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర శ్రేణుల్లో ఉత్సాహం నింపగా, ఆరునెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురులేకుండా పోగా, దేశ రాజకీయాల కేంద్రమైన ఢిల్లీలో కొత్తగా పుట్టిన అమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ-ఆప్) కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. చత్తీస్‌ఘడ్‌లో చివరికంటూ పోరాడినా కూడా కాంగ్రెస్ రెండోస్థానంతో సరిపెట్టుకుంది.

ఈ ఎన్నికల ఫలితాలు త్వరలో రాన ున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైన ల్స్‌గా భావిస్తున్న తరుణంలో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన ఇక్కడి నాయకుల్లో కలవ రం పుట్టిస్తోంది. ఓట్లు, సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్‌ను అడ్డంగా విభజి స్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రభంజనం ముందు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కూడాతుడిచిపెట్టుకుని పోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్‌టీవీ-నీల్సన్ సర్వేతో పాటు వివిధ సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దక్షిణాదిలో మరో పెద్ద రాష్ట్రమైన కర్ణాటక పైనే ఆశలు పెంచుకున్నారు. అయితే ఆదివారం వెలువడిన ఫలితాలతో పాటు ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలను బేరీజు వేస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఆ  పార్టీ ప్రభావం కనిపించదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి-మంత్రుల మధ్య, మంత్రులు-శాసనసభ్యుల మధ్య సఖ్యత లేదన్నది బహిరంగ రహస్యం. ఇక లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీలో అంతర్గత కలహాలు తారస్థాయికి చేరతాయని, ఎన్నికల సందర్భంగా జరిగే టికెట్ల పంపకం తర్వాత ఈ అసంతృప్తి మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మంత్రుల పనితీరుపై గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఇక అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి సంతోష్‌లాడ్ పదవిని కోల్పోవడం కూడా ఆ పార్టీ నాయకులకు మింగుడు పడని విషయం. ఇలా పార్టీ నాయకుల్లో సఖ్యత లేకపోవడం, పాలనా పరంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుండటం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందని ఆ పార్టీనాయకులే పేర్కొంటున్నారు.
 
కమలనాథులకు బూస్టింగ్ ..!

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం ఆ పార్టీ రాష్ట్ర శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి కలిసి వచ్చిన విషయం. ఇదే పంథాను ఇక్కడ కూడా అనుసరించాలని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర చెరుకు రైతులకు జరిగిన అన్యాయం, నేర చరిత్ర కలిగిన నాయకులకు మంత్రిమండలిలో స్థానం కల్పించడం వంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది  రాష్ట్ర నాయకుల ఆలోచన.  

అదే విధంగా కర్ణాటక జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్పను తిరిగి పార్టీలో చేర్చుకుంటే పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకురావ చ్చని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రక్రియ దాదాపుగా పూర్తయిన విషయం తెలిసిందే. ఇలా రాజకీయ బద్దశత్రువైన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీకి దూరమైన నాయకులను తిరిగి దగ్గరకు చేర్చుకుని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 స్థానాలకుగాను కనిష్టంగా 22 స్థానాలు కైవసం చేసుకోవచ్చునని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
 
ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మ్యానిఫెస్టో....

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో అమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) రాష్ట్ర శాఖ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ విజయం అందించిన ఉత్సాహంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కూడా తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను నిలపాలని భావిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక మ్యానిఫెస్టో విడుదల చేసి మంచి ఫలితాలు సాధించిన ‘ఆప్’ రాష్ట్రంలో కూడా ఇదే పంథాను అనుసరించాలని భావిస్తోంది.
 
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు పరిధిలోని సమస్యలను ప్రతిబింబిస్తూ వాటి పరిష్కార మార్గాలను సూచించే విధంగా 28 మ్యానిఫెస్టోలను విడుదల చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని బెంగళూరు వంటి నగరాల్లోని యువ ఓటర్లను ఆకర్షించడంపై ఆ పార్టీ ప్రధానంగా దృష్టి సారించనుంది. మెజారిటీ సీట్లు గెలవకపోయినా యూపీఏ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లలో చీలిక తీసుకువచ్చి లాభపడాలనేది ఆ పార్టీ రాష్ట్ర నాయకుల ఆలోచనగా కనిపిస్తోంది.  
 

Videos

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)