amp pages | Sakshi

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

Published on Thu, 06/26/2014 - 00:12

అచ్చంపేట : మండలంలోని కొండూరు కొండ ప్రాంతాల్లో బుధవారం ఇంట్లో నుంచి 50 రోజుల కిందట వెళ్లిపోయిన యువకుడి పుర్రె, ఎములకు గుర్తించారు. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన గరటా రవితేజ (16) తల్లిదండ్రులు నాగేశ్వరరావు, శ్రీలక్ష్మిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  ఏప్రిల్ 30 రాత్రి ఎనిమిది గంటలకు తమ కుమారుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, అదేరోజు రాత్రి 10:15కు కొండూరుకు చెందిన పులి వీరంరాజు కుమారుడు గోపీకృష్ణ ఫోను చేసి రవితేజ ఉన్నాడా అని అడిగాడని, విషయం ఏమిటని అడిగేంతలో ఫోను పెట్టేశాడని చెప్పాడు.
 
 ఆ తరువాత తమ కుమారుడి కోసం వెతకని చోటు లేదని, బంధువులు, స్నేహితులు అందరిని విచారించి సమాచారం దొరకకపోవడంతో అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాగా, మరో రెండు రోజులు చూడు మీ అబ్బాయి తప్పక వస్తాడని చెప్పారని తెలిపారు. అవశేషాలు లభించిన ప్రదేశంలో మృతుడి పుర్రె, ఎముకలు, మిగిలిన అవశేషాలు అక్కడక్కడ పడి ఉన్నాయి. మృతుని చొక్కా, ప్యాంటు, చెప్పులు పడి ఉన్నాయి. అవి తమ పిల్లవాడివేనని తల్లిదండ్రులు గుర్తించారు. అక్కడే పురుగుమందు బాటిల్ కూడా ఉండటంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. అచ్చంపేట ఎస్‌ఐ అనిల్‌కుమార్ అనుమానాస్పద మృతి కింద కేసు విచారణ చేపట్టారు. పుర్రె, ఎముకలను సత్తెనపల్లి కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు.
 
 ముమ్మాటికీ హత్యే : మృతుడి తండ్రి
 మృతుడి తండ్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ దొడ్లేరు పాలకేంద్రంలో పాలు పోయించుకుంటానని, తమ కుమారుడు సత్తెనపల్లిలోని కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివాడని, గోపీకృష్ణ కూడా అదే కాలేజీలోనే చదివాడని తెలిపాడు. తమ పిల్లవాడు పాసయ్యాడని, గోపీకృష్ణ తప్పి ఇంట్లో పాసైనట్లు చెప్పాడని ఈ క్రమంలో ఏదైనా జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆరోపించాడు.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)