amp pages | Sakshi

మృతులు 20

Published on Wed, 06/18/2014 - 01:24

 పార్వతీపురం రూరల్:జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా సుమారు 109 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ వాతావరణం చల్లబడకపోవడంతో వృద్ధులు, చిన్నారులు ఎండల ధాటికి అల్లాడుతున్నారు. మంగళవా రం కూడా జిల్లాలో సుమారు 20 మంది తీవ్రమైన ఎండ, ఉక్కపోత తట్టుకోలేక మృతి చెందారు. పార్వతీపురం మండలంలోని బుదురువాడ పంచాయతీ... డికె పట్నం గ్రామానికి చెందిన పట్నాన శరణ్ తేజ (8),సంగంవలస పంచాయతీ అడ్డూరువలస గ్రామానికి చెందిన గొల్లపల్లి రామందొర (45) వడదెబ్బతో మృతి చెందారు. ఇద్దరూ ఉదయం ఉక్కపోత భరించలేక అస్వస్థతకు గురై మృతి చెందారు. తహశీల్దార్ ప్రసాద్ ఆదేశాల మేరకు రెండు గ్రామాల్లోనూ వీఆర్‌ఓలు మృతుల వివరాలు సేకరించారు.
 
 కరకాంలో వృద్ధురాలు
 (చీపురుపల్లి రూరల్): మండలంలోని కరకాం గ్రామానికి చెందిన బూర్లె పుణ్యవతి (67) వడదెబ్బకు గురై మృతి చెందింది. సోమవారం రాత్రి తీవ్రమైన ఉక్కపోతకు ఆమె అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు సపర్యాలు చేశారు. అరుుతే మంగళవారం ఉదయం కూడా అదే పరిస్థితి ఉండడంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరై, మృతి చెందింది.
 
 ఎల్. కోటలో ఒకరు
 లక్కవరపుకోట: మండలంలోని సీతారామపురం గ్రా మానికి చెందిన తూర్పాటి అప్పనమ్మ (75) మంగళవారం ఉదయం వడ దెబ్బకు గురై మృతి చెందింది. దీంతో ఇప్పటివరకు మండలంలో ఆరుగురు వడదెబ్బ కారణంగా మృతి చెందినట్టు తహశీల్దార్ ఎం. అరుణకుమారి తెలిపారు.
 
 సీతానగరంలో ఇద్దరు
 సీతానగరం: మండలంలో మంగళవారం ఉదయం వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. లచ్చయ్యపేట గ్రామానికి చెందిన పాలకొండ వెంకమ్మ (60) ఉద యం వంట పని చేసుకుంటుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి సొమ్మసిల్లిపడిపోరుుంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే ఆమె మృతి చెందింది. అలాగే నిడగల్లు గ్రామానికి చెందిన పువ్వల జశ్వంత్ (5) ఉదయం పిల్లలతో ఆడుకుని, ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయూడు.
 
 బాడంగిలో ముగ్గురు
 బాడంగి: మండలంలోని పాల్తేరు, పినపెంకి గ్రామా ల్లో వడగాడ్పులు తట్టుకోలేక మంగళవారం ఇద్దరు వృద్ధులతో పాటు ఒక యువకుడు మృతి చెందారు. పాల్తేరుకు చెందిన చిలకలపల్లి పైడితల్లి (58), బద్రి సుధాకరరావు (31)తో పాటు, పినపెంకికి చెందిన పెద్దింటి శివుడు(65) మృతి చెందా రు. బంధువులు వీఆర్‌ఓల ద్వారా తహశీల్దార్ కార్యాలయానికి మృతుల సమాచారాన్ని అందజేశారు.
 
 జామిలో ఒకరు
 జామి: గొడికొమ్ము పంచాయతీ పరిధిలోని శింగవరం గ్రామానికి చెందిన కొత్తపల్లి సింహాద్రి (56) మంగళవారం ఉదయం తీవ్రమైన ఎండ, ఉక్క పోత ను తట్టుకోలేక మృతి చెందారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
 
 రామభద్రపురంలో ఇద్దరు...
 రామభద్రపురం: మండలంలోని జన్నివలస గ్రామానికి చెందిన పిన్నింటి రామునాయుడు (80), మంగతుత్తి పెంటయ్య (50) మంగళవారం వడదెబ్బతో మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు గంట వ్యవధిలో మృతి చెందడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయూరు.
 
 కొత్తవలసలో ఒకరు
 కొత్తవలస: నిమ్మలపాలెం గ్రామానికి చెందిన గోకేడ అప్పారావు (42) మంగళవారం వడదెబ్బతో మృతి చెందాడు, ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయూడు. ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి మృతునికి   క ుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కొత్తవలస పీహెచ్‌సీ వైద్యాధికారి నిర్మలకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆమె వచ్చి వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్టు ధ్రువీకరించారు.
 
 వెంగాపురంలో వ్యవసాయ కూలి...
 బలిజిపేట రూరల్: వెంగాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి మూడడ్ల మహలక్ష్మి సోమవారం అర్ధరాత్రి ఉక్కపోతతో మృతి చెందింది. గ్రామంలోని గంటావీధికి ఈమె సోమవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చి, అస్వస్థతకు గురైంది. పగలు వడదెబ్బకు గురవ్వడంతో  అర్ధరాత్రి ఉక్కపోతను తట్టుకోలేక మృతి చెందింది.
 
 గరివిడిలో ఫేకర్ కార్మికుడు...
 గరివిడి: పట్టణంలోని బీపీ కాలనీకి చెందిన  ఫేకర్ కార్మికుడు బాసిని శ్రీని వాస్ (40) వడదెబ్బకు గురై మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం విధి నిర్వాహణలో ఉన్న శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యూడు. వెంటనే తోటి కార్మికులు ఆయన్ను ఇంటికి తీసుకువచ్చారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మృతి చెందారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌