amp pages | Sakshi

వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌పై దాడి

Published on Tue, 02/12/2019 - 12:48

అదొక ప్రభుత్వ కార్యాలయం. అప్పుడప్పుడే అధికారులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో అధికార పార్టీ నేత వచ్చారు. నేరుగా వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ వద్దకు వెళ్లి తాను చెప్పిన వ్యక్తి పేరిట ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసి ఇంటి నిర్మాణ బిల్లులు మంజూరు చేయాలని హుకుం జారీ చేశాడు. తన పరిధి మేరకే నడుచోగలనని చెప్పిన వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌పై     ఆగ్రహంతో ఊగిపోయాడు. అందరూ చూస్తుండగానే వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ చెంపను చెల్లుమనిపించాడు. బలంగా గుద్దడంతో గాయపడ్డాడు.

అనంతపురం, కొత్తచెరువు: కొత్తచెరువు హౌసింగ్‌ కార్యాలయంలో అధికారుల సాక్షిగా హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రవినాయక్‌పై టీడీపీ మండల కన్వీనర్‌ దామెదర్‌నాయుడు దాడి చేశాడు. సోమవారం ఉదయం రవినాయక్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండగా దామెదర్‌ నాయుడు అక్కడకు వచ్చాడు. తన బంధువు ఎం.హరిప్రసాద్‌ ఇంటి నిర్మాణం పూర్తి అయిందని, ఫొటో తీసుకుని వెంటనే బిల్లులు మంజూరు చేయాలని చెప్పాడు. ఇంటి నిర్మాణంలో పునాది వరకు తన బాధ్యతని, తర్వాత ఏఓతో మాట్లాడండి అని వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ సమాధానం చెప్పాడు. ‘నేను చెప్పినా వినవా’ అంటూ రవినాయక్‌ చెంపపై దామోదర్‌నాయుడు బలంగా గుద్దాడు. తోటి ఉద్యోగులు జోక్యం చేసుకుని విడిపించారు.

అయినా దామోదర్‌నాయుడు ఆగ్రహం చల్లారలేదు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ బ్యాగును ఆఫీసు నుంచి బయటకు విసిరేశాడు. కులం పేరును ప్రస్తావిస్తూ పత్రికలో రాయలేని పదజాలంతో దూషించాడు. దాడిలో గాయపడిన రవినాయక్‌ను తోటి ఉద్యోగులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పెనుకొండకు పంపించారు. టీడీపీ నాయకుల ఒత్తిడి కారణంగా తమ సార్‌ మల్లికార్జున ఇటీవల గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని బాధితుడు రవినాయక్‌ ఆరోపించాడు. అనంతరం హౌసింగ్‌ అధికారి భాస్కర్‌రావు, లంబాడీ హక్కుల సంఘం నాయకులతో కలిసి బాధితుడు పోలీసుస్టేషన్‌కు చేరుకున్నాడు. కులం పేరుతో దూషించి, దాడి చేసిన దామోదర్‌నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.   

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్