amp pages | Sakshi

హామీలు అమల్లో టీడీపీ విఫలం

Published on Fri, 05/29/2015 - 05:45

ధర్మాన కృష్ణదాసు ధ్వజం
సమర దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

 
 నరసన్నపేట : ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ హామీలు అమలులో పూర్తిగా విఫలమ య్యారని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు అన్నారు. వచ్చే నెల 3,4 తేదీల్లో అమరావతిలో పార్టీ అధ్యక్షుడు జగన్‌మ్మోహనరెడ్డి చేపట్టే సమర దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆయన గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు పాలన తీరును దుయ్యబట్టారు.

ఏ ప్రజలకు ఇచ్చిన  హామీలతో అధికారానికి వచ్చారో వారినే మరిచి సీఎం ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ సవ్యంగా అమలు చేయలేదన్నారు. రుణ మాఫీ పేరిట రైతులను తీవ్రంగా మోసం చేశారని పేర్కొన్నారు. రుణ మాఫీ కాకపోగా వాడుకున్న రుణం వడ్డీతో కలపి తడిసిమొపెడు అవుతోందని అన్నారు. డ్వాక్రా రుణాల వ్యవహారంలో కూడా చంద్రబాబు మహిళలను దారుణంగా మోసం చేశారని అన్నారు. ఈవిధంగా చేయడం చంద్రబాబు నైజమన్నారు.

డ్వాక్రా రుణాలు అన్నింటినీ మాఫీ చేస్తామన్న బాబు.. సీఎం అయిన తరువాత నోటికొచ్చినట్లు మాట్లాడుతూ చివరికి అప్పులపాలు చేస్తున్నారని కృష్ణదాసు ధ్వజమెత్తారు. ప్రస్తుతం డ్వాక్రా సభ్యుల ఖాతాల్లో వేసిన మూడు వేల రూపాయలు కూడా మూలధనం అట అని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకు ఆయన మోసం చేశారని పేర్కొన్నారు. మోసపోయిన ప్రజలకు అండగా ఉంటూ వారి తర ఫున జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు దిగుతున్నారని..ఈ దీక్షల్లో అంతా పాల్గొనాలని కోరారు. పోస్టరు ఆవిష్కరణలో నరసన్నపేట సొసైటీ అధ్యక్షుడు సురంగి నర్సింగరావు, వైఎస్సార్ సీపీ నాయకులు ఆరంగి మురళి, యాళ్ల కృష్ణంనాయుడు, పతివాడ గిరీశ్వరరావు, యాళ్ల బైరాగినాయుడు, బొబ్బాది ఈశ్వరరావు, మొజ్జాడ శ్యామ్, దండి జయప్రకాష్, యాబాజీ రమేష్ పాల్గొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)