amp pages | Sakshi

నీరు–చెట్టు.. అక్రమాల కనికట్టు 

Published on Tue, 06/23/2020 - 08:51

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చూస్తే చాలు. అలాగే టీడీపీ హయాంలో చేపట్టిన నీరు చెట్టు పనుల్లో కొన్నింటిని పరిశీలిస్తే చాలు అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన నీరుచెట్టు పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తేలి్చంది. తమకొచ్చిన ఫిర్యాదుల మేరకు శాంపిల్‌గా కొన్నింటిపై విచారణ చేపట్టగా తీగలాగితే డొంక కదిలినట్టు పెద్ద ఎత్తున అవినీతి బయటపడింది. నాడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అధికారులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రూ. 427.24 కోట్లతో 5696 పనులు చేపట్టగా ఇందులో సగానికి పైగా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. నీరు చెట్టు పనులు ఎంత నాసిరకంగా జరిగాయో ప్రజలందరికీ తెలిసిందే. ఎవరెంత గోల పెట్టినా నాడు పట్టించుకోలేదు. ఇప్పుడా పాపాలు విజిలెన్స్‌ విచారణలో వెలుగు చూశాయి.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో నీరు చెట్టు పనులు పచ్చనేతలకు కల్పతరువుగా మారాయి. వారికి నచ్చినంత అంచనాలు రూపొందించుకుని, వాటికి నిధు లు మంజూరు చేయించుకుని, నామినేషన్‌ పద్ధతిలో పనులు కొట్టేసి వందల కోట్లు దిగమింగారు. గ్రామ స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రి వరకు యథేచ్ఛగా నీరు చెట్టు నిధులను దోచేశారు. దోచిన సొమ్ముతో బహుళ అంతస్థుల భవనాలు, ఎకరాల  కొద్దీ భూములు, కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సంపాదించారు. చెరువులో మట్టి తవ్వకాలకు క్యూబిక్‌ మీటర్‌కు రూ.29 చొప్పన చెల్లించాల్సిన బిల్లులకు క్యూబిక్‌ మీటర్‌కు రూ.82.80 చెల్లించారు. తవ్విన మట్టిని అమ్ముకుని కోట్లాది రూపాయలు మింగేశారు. ఆ విక్రయించిన మట్టిని నీరు చెట్టు పనుల కింద తవ్వినట్టు బిల్లులు చేసుకున్నారు. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్‌ వాల్, చెక్‌ డ్యామ్‌లు, స్లూయిజ్‌లు... ఇలా రకరకాల కాంక్రీటు పనుల రూపంలో కూడా పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. నాసిరకం పనులు చేపట్టడంతో చేసిన పనులు కొన్నాళ్లకే వర్షాలకు కొట్టుకుపోయాయి. గతంలో చేసిన పనులకు మెరుగులు దిద్ది మరికొన్నిచోట్ల పనులు చేసి బిల్లులు చేసుకున్నారు. నాసిరకం నిర్మాణ సామగ్రితో మరికొన్నిచోట్ల పనులు చేసి పెద్ద ఎత్తున నిధులు డ్రా చేశారు. కొన్నిచోట్ల పనులు చేయకుండానే చేసినట్టు చూపించారు.  

ప్రభుత్వానికి విజిలెన్స్‌ నివేదిక 
టీడీపీ హయాంలో జరిగిన నీరు చెట్టు అక్రమాలపై పక్కా ఆధారాలతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నివేదిక తయారు చేశారు. ఎన్ని రకాలుగా అవినీతి జరిగిందో ఉదాహరణతో సహా చూపించారు. అంకెలతో సహా అవినీతి లెక్క తేల్చారు. వీటిన్నింటిపైనా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. విశేషమేమిటంటే ఒకపక్క విజిలెన్స్‌ విచారణలో నీరు చెట్టు పనుల్లో అవినీతి జరిగిందని తేలగా అదే సమయంలో ఆ పనులకు బిల్లులు చెల్లించడం లేదంటూ ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడైతే గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి కూడా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇస్తావా? లేదా? అన్నట్టుగా బెదిరింపులకు సైతం దిగినట్టు సమాచారం.


టెక్కలి మండలం తిర్లంగి సమీపంలోని కొత్త చెరువు  

జిల్లాలో జరిగిన నీరు చెట్టు అక్రమాలివి...  
ఉన్న చెరువు గట్లను బలపడేటట్టు చేయకుండా దానికి బదులు చెరువు గర్భం ఆవల గల ప్రాంతంలో గట్లను వేశారు. మట్టి తవ్వకాల కింద క్యూబిక్‌ మీటర్‌కు రూ.29కు గాను రూ.82.80 చెల్లించారు. ఈ విధంగా 25 పనులకు రూ.59.08 లక్షలు అధికంగా ఖర్చు చేశారు.
చెరువు గట్లపై మట్టిని గట్టి పరచకుండా ఉన్న దాని కంటే అ«ధికంగా నమోదు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరిచారు. ఈ లెక్కన రూ.12.52 లక్షలు స్వాహా చేశారు.
తవ్విన మట్టి శ్మశానం, ఇళ్లు వంటి అవసరాలకు కాకుండా ప్రైవేటు రోడ్లకు వేసుకున్నారు. ఈ తరహాలో చూపించిన 8 పనుల ద్వారా రూ.53.21 లక్షలు అక్రమంగా కొట్టేశారు.
చెరువు మధ్యలో రోడ్డు వేసి ఒక పని కింద రూ.2.14 లక్షలు మింగేశారు. 
వర్షాకాలంలో పాడయ్యే తారురోడ్డు బండకి మట్టిని వేశారు. దీనికింద రూ.7.11 లక్షలు తినేశారు.  
ఒక పనికి ఒక అంచనా రూపొందించి, దానికి అదనంగా నిర్మాణం పేరుతో రూ.లక్షా 60 వేలు నొక్కేశారు. యంత్రాలతో చేసే పనిని మనుషులతో చేసినట్టు చూపించి 14 పనులకు గాను రూ.7.61 లక్షలు వెనకేసుకున్నారు.  
పనుల్లో డిజైన్లు డ్రాయింగ్‌ లేకుండా పనిచేసి రూ.76.23 లక్షలు తినేశారు.  
నాలుగు పనులకు తక్కువ పనిచేసి ఎక్కువ నమోదు చేసి రూ.లక్షా 15 వేలు స్వాహా చేశారు. సర్పలెస్‌ వియ్యర్‌కు చెందిన 2 పనులకు కొలతలు తక్కువగా ఉన్నాయి. వీటి ద్వారా రూ.2.62 లక్షలు దుర్వినియోగం చేశారు.  
మట్టిగట్టు వేయడానికి 5 మీటర్ల దగ్గర్లో మట్టిని తవ్వేసి రూ.3.53 లక్షలు దిగమింగారు.
పనుల టెండర్ల వరకు వెళ్లకుండా టీడీపీ నేతలకు నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టేందుకు ఒక పనిని ముక్కలు ముక్కలుగా విడదీశారు.
తవ్విని మట్టిని ప్రధాన గట్టుపై వేయకుండా ఇతర అవసరాలకు వినియోగించి నిధులు మింగేశారు.
రూ.5 లక్షల విలువ లోపు గల పనులను మాత్రమే నామినేషన్‌ ద్వారా చేపట్టాలి. కానీ శ్రీకాకుళం జిల్లాలో రూ.50 లక్షల వరకు నామినేషన్‌ పనులను కట్టబెట్టి నిధులు స్వాహా చేశారు.
నిబంధనల ప్రకారం 50 ఎకరాల ఆయకట్టు పైబడిన చెరువుల్లో మాత్రమే నీరు చెట్టు పనులు చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా 50 ఎకరాల కంటే తక్కువ ఉన్న చెరువుల్లో కూడా పనులు చేసి నిధులు దుర్వినియోగపరిచారు.
గడ్డ లేదా వాగు నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఎటువంటి డిజైన్‌ లేకుండా చెక్‌ డ్యామ్‌లను నిర్మించారు.
నీరు చెట్టు కార్యక్రమంలో రక్షణ గోడలు నిర్మించరాదు. కానీ అందుకు విరుద్ధంగా ప్రధాన గట్టు కాలువ పొడవునా రక్షణ గోడలు నిర్మించి నిధులు దుర్వినియోగం చేశారు.    

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)