amp pages | Sakshi

టీడీపీ తీరుపై కేంద్రం సిగ్గుపడుతోంది

Published on Fri, 04/29/2016 - 03:18

ఎమ్మెల్యేలను కొనుక్కోవడమేనా ప్రజాస్వామ్యం...
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ఆరోపణ
సేవ్‌డెమొక్రసీ కోసం గడపగడపకు యాత్రలు చేపడతామని వెల్లడి

 
గోపాలపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు అప్రజాస్వామ్య పాలనపై కేంద్రం సిగ్గుపడుతోందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరజూపి కొనుక్కోవడం, అభివృద్ధిని గాలికొదిలేయడం ప్రజాస్వామ్యమా అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి, దాడిశెట్టి రాజా, కళావతి, కంబాల జోగులు, పుష్ప శ్రీవాణి ఢిల్లీలో ‘సేవ్‌డెమొక్రసీ’ యాత్ర ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి గురువారం సాయంత్రం చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రలో అధికార పార్టీ తీరుపై కేంద్రం ఎంత చిన్నచూపుతో ఉందో వివరించారు. టీడీపీ చర్యలను నిరసిస్తూ.. వైఎస్సార్ సీపీ చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు.
 
అడ్డగోలు సంపాదనతో  ఎమ్మెల్యేలను కొంటున్నారు
పట్టిసీమ, రాజధాని భూములపై అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదు. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. ఇది అత్యంత దారుణం. ఒక పార్టీ బీఫాంతో గెలిచిన ఎమ్మెల్యేలను మరో పార్టీ వారు కొనడం రాక్షసపాలనగానే భావిస్తున్నాం. టీడీపీ ప్రభుత్వ ఆగడాలపై పుస్తకరూపంలో కేంద్రానికి విన్నవించాం. టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతి ఎరజూపి ఓట్లేయించుకని ఇపుడు మొహం చాటేసింది. ఫీజు రీయింబర్సుమెంట్ మంజూరు చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదని వాపోయారు. ప్రజలు వైఎస్సార్ సీపీ పక్షాన ఉన్నారు. వైఎస్సార్ సీపీ పోరు ఇది ఆరంభమే.  - బూడి ముత్యాలనాయుడు, మాడుగుల ఎమ్మెల్యే
 
 

 కిడారిని రూ. 30 కోట్లతో కొన్నారు
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.30 కోట్లిచ్చి కొన్నారు. కిడారి సర్వేశ్వరరావు వైఎస్సార్ సీపీకి నమ్మకద్రోహం చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి వెన్నుపోటుపొడిచారు. కొణతాల రామకృష్ణను గురువంటునే ఆయనకు భంగపాటుకు గురిచేశారు. కిడారి స్వలాభం కోసం గిరిజనులను టీడీపీకి తాకట్టుపెట్టారు. గిరిజనులు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై అభిమానంతో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం కోరుతూ ఓట్లేస్తే ఇలా పార్టీ ఫిరాయించారు. ఏజెన్సీలో 50 ఎకరాల మైనింగ్ దోచుకోడానికి కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరడం దారుణం. పార్టీ ఫిరాయింపులపై జాతీయ నాయకులను, ప్రధాన పార్టీల నాయకులను కలిసి అన్నివిషయాలు చర్చించాం. టీడీపీ చర్యలు హాస్యాస్పదమని కేంద్రంలో నాయకులు విమర్శిస్తున్నారు. - గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యే

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)