amp pages | Sakshi

వ్యవసాయంతో ‘ఉపాధి’ వట్టిమాటే

Published on Tue, 08/05/2014 - 01:18

ఏలూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించే అవకాశాలు కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కాలేదు. దీంతో ఈ ఏడాది పాత పనులతోనే కాలక్షేపం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యూరు. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే జిల్లా నీటి యూజమాన్య సంస్థ (డ్వామా) రూ.450 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించగా, ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
 
అరుుతే, వీటిలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పనులేమీ లేవు. ఇదిలావుండగా, ప్రస్తుతం చేపడుతున్న పనుల్లో 60 శాతం నిధులను  వ్యవసాయ అనుబంధ పనుల కోసం ఖర్చు చేయాలని సర్కులర్ జారీ అయ్యింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు మాత్రం విడుదల కాలేదు. గత ప్రభుత్వ హయూంలో అటవీ, ఉద్యాన, వ్యవసాయ, ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ తదితరు శాఖల సమన్వయంతో గ్రామాల్లో 26రకాల పనులను చేసుకోవడానికి అవకాశం లభించింది. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని అటుఇటుగా మార్చి ఉపాధి పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తున్నట్టుగా చెబుతోంది.
 
గతంలో మార్గదర్శకాలు ఉన్నా గ్రామా ల్లో పంటబోదెలు, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో పూడిక తొలగింపు, పుంత రోడ్లు, శ్మశానవాటికల్లో మెరక పనులు, పొలం గ ట్లపై మొక్కలు నాటడం, మెట్టప్రాంత మంచినీటి చెరువుల్లో పూడిక తొలగిం పు పనులు చేపట్టలేదు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగంతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిం చడం ద్వారా పనులు చేపట్టే అవకాశాలు లేవని అధికార వర్గాలు పేర్కొంటున్నారుు. తాజా సర్క్యులర్ ప్రకారం ఏదో రకంగా పనులు చేద్దామన్నా.. వర్షాల కారణంగా కూలీలతో చెరువులు, పొలం గట్ల అభివృద్ధి, ఇతరత్రా పనులు చేసే పరిస్థితి లేదు. ఈ కారణంగా పథకం అనుసంధానం వల్ల ప్రయోజనం ఉండదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)