amp pages | Sakshi

‘ఆడ’.. బిడ్డే

Published on Thu, 10/17/2013 - 03:43

కలెక్టరేట్, న్యూస్‌లైన్ :‘ఆడపిల్ల పుడితే చింతించాల్సిన అవసరం లేదు. ఆడపిల్ల అంటే మీ ఇంట బంగారుతల్లి పుట్టిం దని భావించాలి.’ అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కూమర్ రెడ్డి అదర గొట్టిన విషయం తెలిసిందే! ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బంగారు తల్లి’ పథకం జిల్లా లో అభాసుపాలవుతోంది. ఈ ఏడాది మే 1వ తేదీ  మొదలు మొదటి, రెండవ సంతానంలో పుట్టిన ఆడ శిశువులకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తామని ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం అమలుకు వచ్చేసరికి శీతకన్ను వేస్తోంది. పథకం ప్రారంభమై ఆరు నెలలవుతోన్నా అనుకున్న ఫలితాలు కనిపించడం లేదు. మే 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 3,053 మంది ఆడ శిశువులు జన్మించినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నా.. లబ్ధిదారుల గుర్తింపులో మాత్రం రాష్ట్రంలోనే వెనుకబడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో బంగారుతల్లి సర్వేను ఇందిరాక్రాంతి పథం, అర్బన్ ప్రాంతాల్లో మెప్మాలకు ప్రభుత్వం అప్పగించింది.
 
 ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 3,021 మంది ఆడశిశువులను గుర్తించగా అందులో 2,705మందిని అర్హులుగా తేల్చారు. అయితే వీరిలో 776 మంది ఖాతాల్లో మాత్రమే రూ.19,40,000 జమ అయ్యాయి. ఇక జిల్లాలోని అర్బన్ ప్రాంతాలైన నిజామాబాద్, ఆర్మూర్,  కామారెడ్డి, బోధన్‌లలో బంగారు తల్లి పథకాన్ని ఒక్కరికి కూడా వర్తింప చేయలేదు. అర్బన్ ప్రాంతాల్లో 283 మంది ఆడపిల్లలను ఇప్పటి వరకు గుర్తిస్తే అందులో 184 మందిని అర్హులుగా తేల్చారు. ఆర్మూర్‌లో 28 మంది, బోధన్‌లో ఒకరిని, కామారెడ్డిలో 28 మందిని, నిజామాబాద్ 127 మందిని అర్హులుగా పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఒకరికి డబ్బు లు మంజూరు చేసినప్పటికీ అధికారుల తప్పిదంతో బ్యాంకు ఖాతా నంబర్‌లో తేడా రావ డం వల్ల ఆ డబ్బులు కాస్త వెనక్కి వెళ్లాయి. వివిధ శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా బంగారు తల్లి పథకం జిల్లాలో మసకబారుతోంది.
 
 అమ్మో.. ని‘బంధనా’లు..
 బంగారుతల్లి పథకానికి విధించిన నిబంధనలు లబ్ధిపొందే కుటుంబాలను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగాలి. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆన్‌లైన్‌లో 24 గంటల్లో పేరునమోదు చేయిం చాలి. కాగా దీనికి సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. సాఫ్ట్‌వేర్ అప్‌లోడింగ్ చేసి సమస్య పరిష్కరించేపనిలో ఉన్నమని అధికారులు ఓవైపు చెప్పుకొస్తున్నారు. గ్రామాల్లోఅయితే గ్రామ కార్యదర్శి గుర్తించిన జనన ధ్రువీకరణ పత్రం, అంగన్‌వాడి కార్యకర్త, సంబంధిత పీహెచ్‌సీ డాక్టర్ ధ్రువీకరణ, మహిళ సభ్యురాలు ధ్రువీకరణ, రేషన్ కార్డు లో తల్లిదండ్రుల పేర్లు, ఫొటోలు, బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాలు ఉండాలి. ఈ బాధ్యతలను డీఆర్‌డీఏ మండల ఏపీఎం లేదా సీఎల కు అప్పగించారు. ఇక పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఈ సర్వే బాధ్యతలు చేపడుతుంది. అయితే ఆశించిన స్థాయిలో  సర్వే జరగడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం బం గారు తల్లులకు శాపం గా మారింది. 
 
 బంగారు తల్లంటే...
 ఈ ఏడాది మే1 తర్వాత పుట్టిన ఆడపిల్లలకు పథకం వర్తిస్తుంది. ఆడపిల్ల పెరుగుతున్న కొద్దీ వయస్సు, చదువును బట్టి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. ప్రతి ఏడాది ఇచ్చే పారితోషికం కాకుండా 21 సంవత్సరాలు నిండితే ఇంటర్, డిగ్రీ రెగ్యులర్‌గా పాసైన వారికి రూ.55,500తో పాటు ప్రోత్సాహకంగా రూ. 1,55,500 అందిస్తారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌