amp pages | Sakshi

అరకొర విదిలింపు

Published on Thu, 03/10/2016 - 23:06

ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఈ సారీ మొండిచేయే
తాండవకు రూ.3.05 కోట్లు
రైవాడకు రూ.6.10 లక్షలు
కోనాంకు రూ.5.60 లక్షలు

 
సాగునీటి ప్రాజెక్టులపై రాష్ర్ట ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో ఈ బడ్జెట్ కేటాయింపులు అద్దం పడుతున్నాయి. ఆధునికీకరణ కాదు..కనీసం హెడ్‌వర్క్స్ మెయింటినెన్స్‌కు కూడా ఈ నిధులు ఏమూలకూ సరిపోవని సాగునీటి రంగాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
విశాఖపట్నం:   జిల్లా సాగునీటి ప్రాజెక్టులు  నాలుగేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.  ఏటా రివైజ్డ్ ఎస్టిమేట్స్‌తో ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపడం.. బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు జరపడం అనవాయితీగా మారిపోయింది.  ఏటా మాదిరి గానే ఈ ఏడాది కూడా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జిల్లాకు విదిల్చిన నిధులు చూసి రైతులు బిత్తరపోతున్నారు.

తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు సంబంధించి మిగిలిన 28 కిలోమీటర్ల పనుల కోసం రూ.9 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2015-16 బడ్జెట్‌లో రూ.1.50 కోట్లు కేటాయించారు. మళ్లీ ఈఏడాది     రివైజ్డ్ ఎస్టిమేట్స్ రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2016-17 బడ్జెట్‌లోరూ.3.05కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే కేటాయింపులు పెంచినప్పటికీ ఆధునికీకరణ పనులకు ఏమూలకు సరిపోవని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కేవలం డ్యామ్, హెడ్‌వర్క్స్ మెయింటినెన్స్‌కు మాత్రమే ఈ నిధులు సరిపోతాయని చెబుతున్నారు. మరో పక్క ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరికైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు కేవలం రూ.2 కోట్లు విదిల్చారు. రూ.7,200 కోట్ల అంచనా వ్యయం కాగల ఈ ప్రాజెక్టు ఇంకా బతికే ఉందన్నట్టు బడ్జెట్‌లో రూ.2 కోట్లు విదిల్చడం విడ్డూరంగా ఉందని నిపుణులంటున్నారు. ఈ నిధులు కనీసం సర్వే కూడా సరిపోవని చెబుతున్నారు. రైవాడ రిజర్వాయర్ ఆధునికీకరణ కోసం రూ. 60 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2015-16 బడ్జెట్‌లో రూ.52.50 లక్షలు కేటాయించారు.  ఈ ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ రూ.67 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2016-17 బడ్జెట్‌లో కేవలం రూ.6.10 లక్షలు  విదిల్చారు. గతేడాదే అరకొరనిధులు కేటాయించగా ఈ ఏడాది కనీసం పాతిక కోట్లయినా కేటాయిస్తారని  ఆశించినా కంటితుడుపుగా కేవలం రూ. 6లక్షలకు సరిపెట్టడం ఎంతవరకు సమంజసమని రైవాడ ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు.

పెద్దేరు జలాశయం ఆధునికీకరణ కోసం   ఐదేళ్లుగా మిగిలి ఉన్న 25 శాతం పనుల కోసం ప్రభుత్వం రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపగా. 2015-16లో కేవలం రూ.11 లక్షలు కేటాయించారు. దీంతో ఈ ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ మళ్లీ రూ.8.50 కోట్లకు పంపగా  5 లక్షలు మాత్రమే కేటాయించారు. గతేడాది కేటాయించి నిధులు డ్యామ్ నిర్వహణకు కూడా సరిపోలేదు. ఈ ఏడాది మరీ ఘోరంగా రూ.5 లక్షలు ఇచ్చారు. కోనాం రిజర్వాయర్ ఆధునికీకరణలో భాగంగా మిగిలి ఉన్న మూడు కిలో మీటర్ల పనులు పూర్తి చేసేందుకు  రూ.2 కోట్లు ఇస్తే సరిపోతాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షలు విదిల్చిన సర్కార్ ఈ ఏడాది మరీ ఘోరంగా రూ.5.60 లక్షలు కేటాయిం చింది. ఈ నిధులు డామ్ నిర్వహణకు కూడా సరిపోవు.
 
సర్వేకు కూడా సరిపోవు
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. ఉత్తరాంధ్ర  సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు కేటాయించడ మే నిదర్శనం.  ఈ ప్రాజెక్టు సర్వేకు కూడా ఈ నిధులు సరిపోవు. మిగిలిన ప్రాజెక్టులకు జరిపిన కేటాయింపులు మరీ తక్కువగా ఉన్నాయి. ఇవి ఆయా ప్రాజెక్టుల మెయింటినెన్స్‌కు కూడా సరిపోవు            -ఎస్.సత్యనారాయణ,
 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ శాఖ
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)