amp pages | Sakshi

నిన్ను చూసి ఓట్లేయలేదు?

Published on Tue, 07/08/2014 - 00:00

పార్టీ విప్ ధిక్కరించిన ఎంపీటీసీని నిలదీసిన ప్రజలు
బాపట్ల రూరల్: ‘ఓట్లు వేసి ఎంపీటీసీగా గెలిపిస్తే... నిలువెత్తున ముంచేసి టీడీపీకి ఎందుకు మద్దతు తెలిపావు?.. నిన్ను చూసి ఓట్లువేయలేదని.. జగనన్నను చూసి ఓట్లువేశామంటూ ప్రజలు మండిపడ్డారు.. నీముఖం మాకు చూపించవద్దు’ అంటూ ఈతేరు ఎంపీటీసీ సభ్యురాలు కాగిత నాగభూషణమ్మపై మూడు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈతేరులో సోమవారం ఉద్రిక్తతకు దారితీసే అవకాశం కనిపించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

రాజన్నపై ఉన్న ప్రేమను ఈతేరు, చుండూరుపల్లి, మర్రిపూడి గ్రామస్తులు మరోసారి చాటుకున్నారు. మొదటి నుంచి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న మర్రిపూడి, చుండూరుపల్లి, ఈతేరు గ్రామాల్లోని ప్రజలు తమ పార్టీ అభ్యర్థినిని ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి తిరిగి విజయవాడ నుంచి స్వగ్రామానికి వచ్చిన నాగభూషణమ్మను ప్రజలు నిలదీశారు.

తన ఇష్టమొచ్చినట్లు చేసుకుంటానని ఒకసారి, నన్ను అడిగేందుకు మీరెవరంటూ మరోసారి సమాధానం చెప్పడంతో ప్రజలు ఆగ్రహించారు. పార్టీని, ఓట్లు వేసిన గ్రామస్తులను మోసం చేశావంటూ ఎంపీటీసీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఐ మల్లికార్జునరావు, రూరల్, వెదుళ్ళపల్లి ఎస్‌ఐలు చెన్నకేశవులు, సురేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని సర్దిచెప్పారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)