amp pages | Sakshi

వేరుశెనగ పంపిణీ నేడే

Published on Wed, 06/25/2014 - 02:39

ఇంకా చాలీచాలని సబ్సిడీ విత్తనాలే
కావాల్సింది లక్ష క్వింటాళ్లు
వచ్చింది 12వేల క్వింటాళ్లే

 
చిత్తూరు (అగ్రికల్చర్): సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయల ధరలను నిర్ణయించడానికే సమయాన్నంతా వృథా చేసిన అధికారులు వాటిని జిల్లాకు దిగుమతి చేసుకోవడంలో కూడా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఖరీఫ్ సీజనుకు రైతులకు సబ్సిడీపై వేరుశెనగ విత్తనకాయలు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం నెల రోజులుగా వాటి ధర నిర్ణరుుంచే విషయంలో మీనమేషాలు లెక్కించింది. ఎట్టకేలకు ఈ నెల 21 తేదీన ధర ప్రకటించింది. కానీ ఇప్పటికి కూడా అవసరమైన మేరకు విత్తనకాయలను దిగుమతి చేసుకోలేకపోరుుంది. ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఈ నెల 25 (బుధవారం)న చాలీచాలని విత్తనాలతోనే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది.
 జిల్లాలో ఈ సీజనుకు వేరుశెనగ సాగు సాధారణ విస్తీర్ణం 1,36,479 హెక్టార్లు. ఇందుకుగాను 1.05 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ కాయలు అవసరం. ఇందులో ఇప్పటికి 12 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి.

నెల చివరలోనే వేరుశెనగ కాయలు రైతులకు అందించాల్సి ఉంది. సాధారణంగా జూన్ 15 నుంచి జూలై 15వ తేదీలోగా వేరుశెనగ కాయలు విత్తేందుకు మంచి అదను. ఈ ఏడాది ప్రభుత్వం సీజను దాటిపోయే సమయానికి విత్తనకాయల ధర ప్రకటించింది. దీనికితోడు ఇప్పటికి జిల్లాకు చేరిన 12 వేల క్వింటాళ్ల విత్తనకాయలతో 51 మండలాల్లో అధికారులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. అధికారులు ప్రకటించిన ప్రకారం ఈ నెలాఖరుకుగానీ రైతులకు పూర్తి స్థారుులో విత్తనకాయలు పంపిణీచేసే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. తొలుత 35 వేల క్వింటాళ్లకాయలను జిల్లాకు  తెప్పించి పంపిణీ ప్రారంభిస్తామని జిల్లా వ్యవసాయశాఖ జేడీ ప్రకటించారు. కానీ అది నెరవేరలేదు.
 
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)