amp pages | Sakshi

టీటీడీలో ఆగనున్న రూ.100 కోట్ల పనులు

Published on Tue, 10/21/2014 - 02:26

సాక్షి, తిరుమల: టీటీడీలో జరుగుతున్న సుమారు రూ.100 కోట్ల అభివృద్ధి పనులు ఆగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన సర్వీస్ ట్యాక్స్‌ను టీటీడీ భరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 27 నుంచి పనులు నిలిపివేయనున్నట్టు కాంట్రాక్టర్లు ప్రకటించారు.
 
టీటీడీలో సుమారు 150 మంది కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. తిరుమలతో పాటు దేశ వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులు టీటీడీ కాంట్రాక్టర్లు చేస్తున్నారు. పనుల్లో సుమారు 4 శాతం వరకు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలని కేంద్ర నిబంధన ఉంది. టీటీడీలో సర్వీస్ ట్యాక్స్ వివాదం 2007 నుంచి కొనసాగుతోంది. దీనిపై పలుమార్లు కాంట్రాక్టర్లకు, టీటీడీకి మధ్య చర్చలు జరిగినా పరిష్కారం కాలేదు. రైల్వే, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ తరహాలోనే తమకు మినహాయింపు ఇప్పించాలని, లేనిపక్షంలో ఆ సర్వీసుట్యాక్స్‌ను టీటీడీనే భరించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో లక్షల్లో సర్వీసు ట్యాక్స్‌లు చెల్లించాలంటూ కొందరు కాంట్రాక్టర్లకు నోటీసులు అందాయి. ఇందులో భాగంగా ఈనెల 27 నుంచి టీటీడీ పరిధిలో అన్ని రకాల పనులు నిలిపివేస్తున్నట్టు కాంట్రాక్టర్ల సంఘం నేత టి.నరసింహారెడ్డి ప్రకటించారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు టీటీడీ ఉన్నతాధికారులు చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు.
 

Videos

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?