amp pages | Sakshi

రమీజా..మజాకా!

Published on Mon, 06/30/2014 - 04:24

  • టీవీ క్విజ్‌ల్లో  వరుస విజయాలు
  •  మా టీవీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లోనూ ప్రతిభ
  • చదివింది నర్సింగ్.. సాధిస్తున్నది బుల్లితెర బహుమతులు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడేళ్లలో మూడు కార్యక్రమాల్లో ప్రతిభ చాటి హ్యాట్రిక్ సాధించాడు. అతనే మదనపల్లెకు చెందిన మహమ్మద్ రమీజ్. మా టీవీ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో పాల్గొని రూ.3.20 లక్షలు  గెలుచుకున్నాడు. దీనికి సంబంధించిన కార్యక్రమం ఆదివారం మాటీవీలో ప్రసారమైంది.
     
    మదనపల్లె సిటీ : మదనపల్లెలో ఓ విద్యార్థి టీవీ క్విజ్ పోటీల్లో దూసుకుపోతున్నాడు. వరుస విజయాలతో అదరహో అనిపిస్తున్నాడు. ఇం దిరానగర్‌లోని ఫైరోజ్, జాహిదా దంపతులు. వీరి మొదటి కుమారుడు రమీజ్. 2012లో సోనీ టీవీలో అమితాబచ్చన్‌తో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో, 2013లో విజయ్ టీవీలో ప్రసారమైన ప్రకాష్‌రాజ్‌తో తమిళంలో ‘నీంగళ్ వెలలామ్ ఒరుకోడి’ (నీవు ఒక కోటి గెలవచ్చు) కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

    అమితాబ్, ప్రకాష్‌రాజ్‌తో కలిసి పలు క్విజ్‌లకు జావాబులిచ్చి అధిక మొత్తంలో బహుమతులను గెలుపొందాడు. తాజాగా మా టీవీ కార్యక్రమంలో మీలో ఎవరు కోటీశ్వరుడులోనూ అర్హత సాధించి రాయలసీమలోనే మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. రమీజ్ వృత్తిరీత్యా నర్సింగ్ కోర్సును పూర్తి చేశాడు. ఉద్యోగాన్వేషణలో భాగంగా ప్రతి రోజూ పత్రికలతో పాటు జీకే, కరెంట్ అఫైర్స్ పుస్తకాలను చదివేవాడు.

    ఈ నేపథ్యంలో వరుసగా మూడు సంవత్సరాల్లో మూడు ప్రధాన కార్యక్రమాల్లో ఎంపికై హ్యాట్రిక్ సాధించాడు. అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇతని విజయం పట్ల రాజీవ్ విద్యామిషన్ అకడమిక్ మానిటరింగ్ అధికారి మహమ్మద్‌ఖాన్, టైలర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ. ఎస్.నజీర్, అంజుమన్ కమిటీ సభ్యులు ఖాదర్‌హుస్సేన్, సయ్యద్‌బాషా, ఎస్.హెచ్.రహమా న్, అలీ ఖాన్, రఫీవుల్లాఖాన్ అభినందించారు.
     
    ఓటమే గెలుపునకు రాచబాట

    క్విజ్ కార్యక్రమాల్లో చిన్నచిన్న తప్పిదాలతో అద్భుత విజయాలు దూరమవుతాయి. నిరాశ, నిస్ఫృహలకు లోనుకాకూడదు. మరింత పట్టుదలతో ముందుకెళితే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చు. ఓటమి గెలుపునకు రాచబాట. మాటీవీ కార్యక్రమంలో రూ.25 లక్షలు గెలుపు వరకు వెళ్లా. ఓ చిన్నపొరబాటుతో దాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎప్పటికైనా కోటి రూపాయల క్విజ్‌ను సాధించి తీరుతా.                               
    - మహమ్మద్ రమీజ్
     

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)