amp pages | Sakshi

ఇదేం ఖర్మ బాబూ..

Published on Tue, 05/05/2015 - 05:46

- రెండుమార్లు వివరాలు అందజేసినా అందని రుణ మాఫీ సొమ్ము
- మరోమారు అధికారులకు పత్రాలు సమర్పించేందుకు వస్తున్న రైతులు
- ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి
సాక్షి, కడప :
రుణ మాఫీ దక్కని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ వద్ద రైతులు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రుణ మాఫీ కాని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అనువుగా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినప్పటికీ టోకన్ల కోసం వారు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. వివరాలు సమర్పించడానికి ఉదయం ఒకసారి మాత్రమే టోకన్లు ఇస్తుండటంతో ఆ తర్వాత వచ్చిన రైతులు గంటలకొద్దీ ఎదురు చూడాల్సి వస్తోంది. వృద్ధులైన పలువురు రైతులు ఇదేం ఖర్మ అనుకుంటూ వేదనతో వెనుదిరుగుతున్నారు.

ఎన్నిమార్లు పత్రాలు సమర్పించినా ఏదో ఒక కొర్రీ వేస్తూ రైతులను సతాయిస్తున్నారు.    జిల్లాలో 4,95,008 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. తొలి విడతలో 2,78,070 మందికి వర్తించజేయగా, రెండవ విడతలో 1,33,048 మందికి వర్తింపజేశారు. ఇందుకు రూ.450 కోట్లు కేటాయించారు. అయితే చాలా మంది రైతులు బ్యాంకులకు వెళ్లి రుణమాఫీ అయిన సొమ్ము  ఇవ్వాలని అడగడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వడ్డీ భారం బాగా పెరిగిపోయింది. గత ఏడాది, ఈ ఏడాది కలుపుకుని లక్షకు దాదాపు రూ. 25 వేల పైచిలుకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలుగుదేశం సర్కార్ మాత్రం రుణమాఫీ పేరుతో రూ. లక్ష ఉన్న రైతుకు రూ. 20 వేలు మాత్రమే ప్రస్తుతానికి మాఫీ చేసింది. రైతు బ్యాంకుకు వెళ్లి మాఫీ సొమ్ము అడిగితే రెన్యూవల్ చేయాలని అధికారులు అడుగుతున్నారు. రెన్యూవల్ చేసుకోవాలంటే అదనంగా రైతు కొంత మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మాఫీ అయిన సొమ్మును తెచ్చుకోలేక కొంతమంది రైతులు ఇబ్బంది పడుతుంటే మరో పక్క మాఫీ కాక మరి కొంతమంది అవస్థలు పడుతున్నారు. మాఫీ కాని రైతులు దాదాపు 83 వేల మంది ఉన్నట్లు అంచనా. ఇటీవలే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణమాఫీ సెల్‌కు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ ఆధార్, రేషన్ కార్డును పరిశీలించి పొరపాట్లు సరిచేస్తున్నారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)