amp pages | Sakshi

గ్రామం ఒక్కటే..పేర్లు రెండు 

Published on Mon, 03/25/2019 - 11:23

సాక్షి, నరసరావుపేట :  ఒకే గ్రామం.. కానీ రెండు నియోజకవర్గాలు. ఎదురెదురు ఇళ్లలోని వారు ఓటు వేసేది మాత్రం వేర్వేరు అభ్యర్థులకు. ఇటువంటి చిత్రమైన పరిస్థితి నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల సరిహద్దులోని రెండు గ్రామాల్లో నెలకొంది. కోటప్పకొండ సమీపంలోని యక్కలవారిపాలెం, కట్టుబడివారిపాలెం గ్రామాలు పేరుకే రెండు గ్రామాలు.

ఒకే గ్రామంగా కలిసి ఉంటాయి. కేవలం రెండు గ్రామాలను విడదీసేది ఒక రోడ్డు మాత్రమే. రోడ్డుకు తూర్పున నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కట్టుబడివారిపాలెం ఉండగా, పశ్చిమాన నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని యక్కలవారిపాలెం గ్రామం ఉంది. ఎన్నికల సమయంలో రెండు నియోజకవర్గాల నాయకులు గ్రామాన్ని రెండు గ్రామాలుగా విడదీస్తున్న ఒకే మెయిన్‌రోడ్డుపై ప్రచారం చేస్తుంటారు. 

కొత్తపాలెం పరిస్థితి ఇదే..
కొత్తపాలెం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నరసరావుపేట మండలంలోని కొత్తపాలెం, చిలకలూరిపేట మండల పరిధిలోకి వచ్చే అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామాలు రెండు కలిసే ఉంటాయి. ఈ రెండు గ్రామాలను కూడా విడదీసేది ఒకే రోడ్డు. రోడ్డుకు ఒక వైపు ఆమీన్‌సాహెబ్‌పాలెం(అవిశాయపాలెం), రెండో వైపు కొత్తపాలెం గ్రామాలున్నాయి. మిగిలిన సమయంలో రెండు గ్రామాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తుంటారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అవి రెండు గ్రామాలని చెబితేగానీ తెలియదు. ఎన్నికల్లో మాత్రం ఇక్కడి ఓటర్లు  తమ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల అభ్యర్థులకు ఓటు వేస్తుంటారు.    

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌