amp pages | Sakshi

రాయల దేవరకొండపై వజ్రాలు !?

Published on Mon, 03/14/2016 - 13:30

  వజ్రాలున్నాయంటూ ప్రచారం
  గుర్తు తెలియని వ్యక్తుల తవ్వకాలు
  రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు

 
ఆ గ్రామస్తులు దైవంగా పూజించే కొండను గుర్తు తెలియని వ్యక్తులు కొన్నాళ్లుగా రోజూ వచ్చి ఏదో తవ్వి తీసుకువెళ్తున్నట్టు ప్రచారం జరిగింది. అది ఉత్తుత్తిదేనని కొన్నాళ్లుగా కొట్టి పారేస్తున్న గ్రామస్తులకు ఈ నెల 11న కొండపైకి వెళ్లిన ఓ వ్యక్తికి అక్కడ తవ్వకాలు జరిగిన ప్రదేశం కనిపించింది. ఆ విషయం కాస్త చూసిన వ్యక్తి కొండపై జరిగిన తంతును, తవ్వకాలను గ్రామస్తులకు తెలిపాడు. అంతే..ఆదివారం గ్రామస్తులంతా కొండెక్కారు. తవ్వకాలను కళ్లారా చూశారు.. అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కలవరానికి గురయ్యారు. దీనిపై అధికారులే నిజాల నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. వారే శ్రీకాకుళం జిల్లాలోని రాయల గ్రామస్తులు. తవ్వకాలకు గురైనది ఈ గ్రామానికి సమీపంలో ఉన్న దేవరకొండ. వివరాల్లోకి వెళ్తే...

కొత్తూరు :  జిల్లాలోని కొత్తూరు మండలంలోని రాయల గ్రామానికి సమీపంలో ఉన్న దేవరకొండ శిఖర భాగంలో రెండు బండరాళ్ల మధ్య అడుగున వజ్రాలు, వైఢూర్యాలతో పాటు విలువైన రంగురాళ్లు ఉన్నాయన్న ప్రచారం ఆదివారం కలకలం రేపింది. ప్రచారాన్ని నమ్మిన గ్రామస్తులు దేవరకొండ పైకి వెళ్లారు.  వీఆర్‌వో కలమట రమేష్‌కు గ్రామస్తులు కొందరు ఫిర్యాదు చేశారు. కొండ మీద తవ్వకాలు పరిశీలించి జరిగిన సంఘటనపై తహశీల్దార్ కార్యాలయూనికి నివేదిక అందించినట్టు వీఆర్‌వో తెలిపారు. దీనిపై వివరాలు సేకరించగా పై రెండు బండరాళ్ల మధ్యన రెండు నెలల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తవ్వకాలు చేసినట్టు తెలిసింది. వీరు ఆటో, కారు, బైక్‌ల మీద రోజూ వచ్చి తవ్వకాలు గోప్యంగా చేస్తున్నట్టు సమాచారం. సాయంత్రం పూట గోనె సంచులతో ఆటో మీద తిరిగి వెళ్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. రెండు నెలల నుంచి ఈ తంతు జరుగుతున్నా గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు.

ఈ క్రమంలో ఈ నెల 11న కొండ మీద ఉన్న ప్రాంతంలో జీడి తోట ఉన్న ముగితి భాస్కరరావు తోట కాపు ఎలా ఉందో చేసేందుకు వెళ్లాడు. అప్పటికే ఆ ప్రాంతంలో తవ్వి బయట పడేసిన రాళ్లను చూసి విషయూన్ని గ్రామస్తులకు తెలిపాడు. దీంతో తవ్వకానికి మళ్లీ వచ్చిన వారిని మాజీ సర్పంచ్ జనార్ధనరావు 11న ప్రశ్నించారు. రాళ్ల కింద మట్టి ఔషధాల కోసం ఉపయోగపడుతుందని వారు చెప్పగా ఇకపై ఇక్కడ ఎటువంటి తవ్వకాలు చేయొద్దని ఈ కొండను దేవతలుగా పూజిస్తున్నామని తెలిపారు. అరుుతే శనివారం కూడా వేరే మార్గంలో వారు వచ్చి వెళ్లినట్టు గ్రామస్తులకు తెలిసింది.

అదే సమయంలో తవ్వకాల ద్వారా విలువైన రంగురాళ్లు, వజ్రాలు దొరికినట్టు ప్రచారం జరగడంతో గ్రామస్తులు ఆదివా రం కొండపైకి వెళ్లారు. తవ్విన చోట పరిశీలించారు. తవ్వకాలు చేసిన వారిలో ఒకరు రుద్రాక్షమాలలు వేసి ఉండగా మిగతా నలుగురు మామూలుగా ఉన్నారని, వీరు తమ వివరాలు ఎవరికీ చెప్పకుండా గోప్యంగా వచ్చి వెళ్తున్నారని తెలిసింది. దీంతో ఈ విషయం పరిసర ప్రాంతాల్లో వ్యాపించి ఆదివారం పెద్ద చర్చనీయూంశమైంది. ఇది లా ఉండగా గ్రామస్తులు దేవర కొండను దేవతల కొండగా భావిస్తూ వర్షాలు కురవని సమయంలో పూజలుచేస్తూ విశ్వాసం ప్రదర్శిస్తారు.ఈక్రమంలోజరిగిన తవ్వకాలపై అధి కారులు సమగ్ర దర్యాప్తు అనుమానాలు నివృత్తి చేయూలని స్థానికులు కోరుతున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)