amp pages | Sakshi

ప్రవేశానికి వేళాయె!

Published on Wed, 05/21/2014 - 01:22

  •  ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
  •   ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు జూన్ 16
  •   పోస్టల్ దరఖాస్తులకు జూన్ 21
  •   జూలై 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్
  •   జూలై 28 నుంచి తరగతులు
  •   గ్రామీణ విద్యార్థులకు పెద్దపీట
  •  నూజివీడు, న్యూస్‌లైన్ : ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుంది. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ(ఆర్కే వ్యాలీ), బాసర ట్రిపుల్ ఐటీలలో 2014-15 విద్యాసంవత్సర ప్రవేశాలకు విశ్వవిద్యాలయ కులపతి రాజ్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధమైంది.

    ఆరు సంవత్సరాల సమీకృత బీటెక్ డిగ్రీ కోర్సుకు సంబంధించి మొదటి సంవత్సరంలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పదోతరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు జూన్ 16 (రాత్రి 8 గంటల వరకు) ఆఖరు తేదీ కాగా, ముద్రిత దరఖాస్తులను జూన్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు విశ్వవిద్యాలయానికి పంపాల్సి ఉంటుంది.

    దరఖాస్తుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు అయిన రూ.150 చెల్లించినట్లుగా తెలిపే బ్యాంక్ చలానా గాని, ఏపీ ఆన్‌లైన్ రసీదు గాని జతచేయాలి. పదోతరగతికి సంబంధించిన మార్కుల జాబితాను, హాల్‌టికెట్‌లను కూడా జతచేసి పంపాలి. దరఖాస్తు చేసుకున్నవారిలో ఎంపిక చేసిన జాబితాను జూలై ఎనిమిదిన ప్రకటిస్తారు. జూలై 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 27న వెయిటింగ్ జాబితాలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, జూలై 28 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.
     
    సీట్ల కేటాయింపు జరిగేదిలా...

    రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీలకు కేటాయించిన మూడువేల సీట్లలో రెండు శాతం మాజీ సైనిక ఉద్యోగుల (కాప్) పిల్లలకు కేటాయిస్తారు. వికలాంగులకు మూడు శాతం, ఎన్‌సీసీ కోటా కింద ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.05 శాతం చొప్పున  కేటాయించనున్నారు. నాలుగు కేటగిరీలకు కలిపి మొత్తం 195 సీట్లు పోగా మిగిలిన 2,805 సీట్లలో ఓపెన్ కేటగిరీ కింద 15 శాతం అంటే 421 సీట్లు కేటాయిస్తారు. మిగిలిన 2,384 సీట్లలో ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంతానికి 1001 (42 శాతం) సీట్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతానికి 858 (36 శాతం) సీట్లు, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంతానికి 525 (22 శాతం) సీట్లు కేటాయించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)