amp pages | Sakshi

కాంగ్రెస్‌లో చేరనున్న రాములమ్మ?

Published on Tue, 08/20/2013 - 08:38

మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆమెను టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. చాలాకాలం నుంచి కాంగ్రెస్ వైపు చూస్తున్న ఆమె ఇక త్వరలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో ఢిల్లీలో సమావేశం కావడంతో ఆ పార్టీలో చేరికపై మరింత స్పష్టత వచ్చింది. సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం. రంగారెడ్డి ద్వారా దిగ్విజయ్‌ను కలుసుకోవడం కూడా చర్చనీయాంశమైంది.
 
 కాం గ్రెస్ పార్టీలో చేరికకు ఏది సరైన సమ యం?, ఎలా చేరాలనే అంశాలపై ఈ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి దిగ్విజయ్‌సింగ్ సైతం కొన్ని సూచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారాన్ని తెలిపిన తర్వాత కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనంపై కేసీఆర్ చేసిన ప్రతిపాదనపై అందరి చూపు కేంద్రీకృతమై ఉంది. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం ద్వారా పార్టీని నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. టీఆర్‌ఎస్ నుంచి సస్పెండైన జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునందన్ రావు కూడా దిగ్విజయ్ సింగ్‌ను కలుసుకున్న వారిలో ఉన్నట్టు సమాచారం.
 
 ఆంటోని కమిటీతో జిల్లా ప్రజాప్రతినిధుల భేటీ..
 తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సోమవారం రాత్రి ఆంటోని కమిటీతో సమావేశమై ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించింది. ఈ భేటీలో పాల్గొన వారిలో డిప్యూటీ సీఎం దామోదర, మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి, నర్సారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆంటోని కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌