amp pages | Sakshi

మద్యం రక్కసిపై కన్నెర్ర

Published on Mon, 11/04/2013 - 00:37

నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్ : మద్యం మహమ్మారిపై ఆ గ్రామస్తులు కన్నెర్ర చేశారు. పంచాయతీ పాలకులపై ఒత్తిడి తెచ్చారు. గ్రామంలో మద్యనిషేధం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. గ్రామంలో ఎక్కడా మద్యం అమ్మకాలు జరపటంగానీ, మద్యం సేవించడం గానీ చేయకూడదంటూ పంచాయతీ తీర్మానం చేయించారు. వివరాలివి.. సుమారు ఆరువేల మందికిపైగా జనాభా కలిగిన గ్రామం జొన్నలగడ్డ. గత దశాబ్దన్నర నుంచి గ్రామంలో పుట్టగొడుగుల్లా మద్యం గొలుసు దుకాణాలు పుట్టుకొచ్చాయి. ఎంతోమంది మద్యం మహమ్మారి కోరల్లో చిక్కుకొని విలువైన జీవితాలను అర్ధంతరంగా చాలించారు.
 
 గ్రామంలో వేల రూపాయల మద్యం అమ్మకాలు సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నూతనంగా పంచాయతీ పాలకవర్గం ఎన్నికైంది. ప్రజల బాధలను అర్ధం చేసుకున్న పాలకులు గ్రామంలో మద్యం మహమ్మారిని పారదోలేందుకు కంకణం కట్టుకున్నారు. సమావేశాన్ని ఏర్పాటుచేసి తమ పంచాయతీ పరిధిలో మద్యం, బెల్టుషాపులు నడవకూడదని తీర్మానించారు. యథేచ్ఛగా మద్యం సేవించకూడదని, అలాచేస్తే చర్యలు తీసుకుంటామంటూ తీర్మానించారు. జొన్నలగడ్డ శివారు గ్రామం రంగారెడ్డిపాలెంలో 40 ఏళ్లుగా మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అలాగే పాలపాడు గ్రామంలో దశాబ్దన్నర నుంచి పూర్తిగా మద్యాన్ని నిషేదించారు. ఆ రెండు గ్రామాలను ఆదర్శంగా తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాన్ని అంతా హర్షిస్తున్నారు.  
 
 ప్రజల కోసం తీర్మానం..
 మద్యం మహమ్మారి వల్ల గ్రామస్తులు పడుతున్న బాధలు అర్ధం చేసుకున్నాం. మద్యం మహమ్మారిని తరిమికొట్టాలని నిర్ణయించాం. ప్రజలు కూడా సహకరించాలి.
 -  దొండేటి అప్పిరెడ్డి, సర్పంచి
 
 మహిళలకు సంతోషం..
 మద్యానికి బానిసలై అనారోగ్యంతో ఇప్పటికే ఎంతోమంది మృతి చెందారు. కొందరు అప్పులపాలై, అనారోగ్యానికి గురై అవస్థలు పడుతున్నారు.  మా గ్రామంలో మద్యపానం నిషేదించడం మహిళలందరికీ సంతోషంగా ఉంది.
             - దేవిరెడ్డి రాజ్యలక్ష్మి

Videos

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)