amp pages | Sakshi

నీటి యుద్ధాలు ప్రారంభం

Published on Wed, 02/25/2015 - 01:34

మర్లగుమ్మి నీటికోసం రైతుల మధ్య వాదన
ఇదే విషయమై గతేడాదీ కొట్లాట
కోనాం నీటి విడుదలకు  అధికారుల హామీ

 
చోడవరం: రబీ పంటలను కాపాడుకునేందుకు సాగునీటి కోసం యుద్ధాలు ప్రారంభమయ్యాయి. వరహాపురం మీదుగా కొండ గెడ్డలోవచ్చే కోనాం జలాశయం నీటి కోసం చీడికాడ మండలం వరహాపురం, చోడవరం మండలం దామునాపల్లి, మైచర్లపాలెం గ్రామాల రైతుల మధ్య మంగళవారం వివాదం నెలకొంది. దామునాపల్లి, మైచర్లపాలెం పరిధిలోని భూములకు నీరందించేందుకు మర్లగుమ్మి చానల్ ప్రత్యేక కాలువ ఉంది.  దీనిద్వారా చివ రి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందకపోవడంతో దామునాపల్లి, మైచర్లపాలెం ప్రాంతాల్లో చెరకు, రబీవరి దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో వరహాపురం పొలాల మీదుగా మర్లగుమ్మి ఛానల్ స్లూయీస్ నుంచి ప్రవహించే  కొండగెడ్డ తమ పొలాల మీదుగా ప్రవహిస్తున్నందున, ఆ నీటిని తమకు కూడా ఇవ్వాలని రెండు గ్రామా ల రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాము వినియోగించుకోగా మిగిలిన కొండగెడ్డ నీరు దిగువప్రాంతానికి వెళ్తుందని వరహాపురం రైతులు వాది స్తున్నారు. ఈ వివాదం ఇరు ప్రాంతాల రైతుల మధ్య మూడేళ్లుగా సాగుతోంది.

గతేడాది కొట్లాటకు దారితీసింది. సాగునీటి కొరత ఏర్పడటం వల్ల వారిమధ్య మళ్లీ వివాదం చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా కొండగెడ్డకు నిర్మించిన చెక్‌డ్యాం స్లూయీస్‌లను కాంక్రీట్‌తో మూసి, దిగువకు నీరు రా కుండా చేశారని  దామునాపల్లి, మైచర్లపాలెం ప్రాంతాల రైతులు పోలీసు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కోనాం జలాశయం డిప్యూటీ ఇంజనీర్ కె.మాధవి, చోడవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు కనిశెట్టి మచ్చిరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వేసిన కాంక్రీట్‌ను తొలగించాలని డీఈ ఆదేశించారు. నీరు దిగువప్రాంతానికి వెళ్లేలా వెంటనే మైచర్లపాలెం, దామునపల్లి రైతులు కాంక్రీట్ దిమ్మలను కొద్దిగా తొలగించారు.

ఇది అన్యాయమంటూ వరహాపురం రైతులు అధికారులను అడ్డగించారు. తాము ఎంతో ఖర్చుపెట్టి, కాలువల్లో పూడిక తీసి నీరు తెచ్చుకున్నామని, అలాంటిది ఇప్పుడు దిగువ ప్రాంతానికి ఎలా నీరు ఇస్తారని ధ్వజమెత్తారు. వెంటనే కోనాం నీరును మర్లగుమ్మి ఛానల్ ద్వారా కొండగెడ్డలోకి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, రైతుల ఎవరి వాదన వారు అధికారులకు వినిపించారు. జలాశయం నీరు విడుదల చేస్తామని డీఈ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
 

Videos

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?