amp pages | Sakshi

రానున్న 48గంటలు.. వెదర్‌ అప్‌డేట్‌

Published on Thu, 07/12/2018 - 11:58

సాక్షి, హైదరాబాద్‌ / విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్‌లో గత రాత్రి నుంచి కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అంతే కాకుండా రోడ్లపై నీరు చేరి గుంతలు పడటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందలకు గురయ్యారు.

ఇక ఏపీ విషయానికి వస్తే విశాఖపట్నంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మొత్తం మబ్బులతో ముసురు కప్పేసింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. వాటితో పాటు రానున్న 48 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని కారణంగా ఈ నెల 16న మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

అల్ప పీడనాల కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉత్తర తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు, కొన్ని  చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55-60 కిలోమీటర్లు, ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)