amp pages | Sakshi

పెళ్లికానుకకు పల్స్‌ పోటు

Published on Fri, 04/27/2018 - 13:16

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుకకు ఆంక్షలు గుదిబండగా మారాయి. పథకం ప్రకటన సమయంలో పెళ్లి చేసుకునే ప్రతి జంటకు కానుక అందుతుందనే ఆశలు కల్పించారు, తీరా దరఖాస్తు చేసుకున్న వారిలో పదోవంతుకు కూడా కానుక అందుతుందనే నమ్మకం లేకోయింది.

చంద్రన్న పెళ్లి కానుక పథకం ఈ నెల 11వ తేదీన అమలులోకి వచ్చింది. ఇందుకోసం ప్రతి మండలానికి డ్వాక్రా సంఘాల నుంచి ముగ్గురు వివాహ మిత్రలను నియమించారు. వీరికి ఆ మండల పరిధిలో జరిగే వివాహాలను బట్టి కమిషన్‌ చెల్లించేలా నియమించారు. పుట్టిన తేదీ ధ్రువీకరించే పదో రగతి సర్టిఫికెట్‌ లేదా మీ సేవా ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్, దివ్యాంగులైతే వైకల్య నిర్థారణ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ కోసం తెల్లకార్డు లేదా మీసేవ ద్వారా తీసుకునే ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్, వధువు బ్యాంకు ఖాతా, ఇరువురి ఆధార్‌ కార్డులు ఇలా అన్ని వివరాలు ప్రత్యేకంగా రూపొందించే యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత వివాహ మిత్రలు వారి ఇళ్లకు వెళ్లి చుట్టుపక్కల వార్ని నిర్ధారించుకొని ఆన్‌లైన్‌లో పొందుపర్చిన వివరాలన్ని సరిపోల్చుకున్న తర్వాత అన్ని అర్హతలుంటే పెళ్లి రోజున 20 శాతం, ఆ తర్వాత వారం రోజుల్లో మిగిలిన 80 శాతం పెళ్లి కుమార్తె ఖాతాకు ఆ మొత్తం జమవుతుంది.

అందుబాటులోకి రాని యాప్‌
రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన యాప్‌ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో 1100కు కాల్‌ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేస్తే వివాహమిత్రలు వారి ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. వాటిని గతేడాది జరిగిన ప్రజాసాధికారిత సర్వేలో ఉన్న వివరాలతో అనుసంధానిస్తారు. నిన్న..మొన్నటి వరకు రేషన్‌ కార్డు కావాలన్నా..పింఛన్‌ కావాలన్నా పల్స్‌ (ప్రజా సాధికార) సర్వేయే ఆధారం. లంతేనా: ఆ సర్వే ఆధారంగా సంక్షేమ పథకాలకు అర్హత కోసం నిర్దేశించిన 13 అంశాల ప్రాతిపదికన అర్హతను నిర్ధారిస్తారు. వాటిలో ఏ ఒక్కటి ఉన్నా కానుకకు దూరమైనట్టే.

819 జంటల్లో 239 మందికే..
ఈ నెల 11వ తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లాలో అల్పాదాయ వర్గాలకు చెందిన 819 జంటలకు వివాహాలు జరగగా వారంతా 1100 ద్వారా ఆన్‌లైన్‌లో పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకున్నారు. 109 మంది పెళ్లికుమార్తెలు, 171 మంది పెళ్లి కుమారులను సర్వేలో పేర్కొన్న పుట్టిన రోజు తేదీ, ఆధార్‌లో పేర్కొన్న తేదీ వేర్వేరుగా ఉందన్న సాకుతో తిరస్కరించారు. అలాగే 120 మంది పెళ్లి కుమార్తెలు, 200 మంది పెళ్లి కుమారులకు ఇదే రీతిలో సర్వేలోనూ, ఆధార్‌లోనూ, ఇతర రికార్డుల్లో ఉన్న కుల ధ్రువీకరణ పత్రాల్లో తేడాలున్నాయన్న కారణంతో తిరస్కరిం చారు. ఈ విధంగా మొత్తం  680 జంటలు కానుకకు దూరమయ్యాయి. కేవలం 239 జంటలను అర్హులుగా తేల్చారు. వారికి మాత్రమే ఇప్పటి వరకు పెళ్లి కానుక అందజేశారు. మొత్తమ్మీద పల్స్‌ సర్వే పింఛన్, రేషన్‌కేకాదు కానుకకు గండంగానే మారింది.

పథకం ఇదీ..చంద్రన్న పెళ్లి కానుక
ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలైతే రూ.50వేలు,  బీసీలైతే రూ. 35వేలు, ముస్లీంలకు 50వేలు ఇస్తారు. విభిన్న ప్రతిభావంతులైతే ఏ సామాజిక వర్గానికి  చెందిన వారికైనా రూ.లక్ష వరకు ఇస్తారు.

త్వరలోనే యాప్‌
మే 5వ తేదీన పెళ్లి కానుక యాప్‌ రానుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పెళ్లి చేసుకునే జంట వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. పల్స్‌ సర్వేలో నమోదై ఉండి అర్హత గల వారికి మాత్రమే కానుకలు మంజూరవుతాయి. అవకతవకలకు, అవినీతికి ఆస్కారం లేని రీతిలో చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. – సత్యసాయి శ్రీనివాస్,పీడీ, డీఆర్‌డీఎ

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)