amp pages | Sakshi

ఫేస్‌బుక్‌తో బుక్కయ్యాడు

Published on Sat, 11/08/2014 - 01:43

యువతిపై మోజుతో నగరానికి చేరిన భీమవరం వాసి
పోలీసులమంటూ బెదిరించి బంగారం దోచుకున్న ముగ్గురు యువకులు
పోలీసుల అదుపులో ముగ్గురు

 
చిట్టినగర్  :  పోలీసులమంటూ ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిని బెదిరించి ఏడు కాసులకు పైగా బంగారాన్ని దోచుకున్నారు. కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జక్కంపూడిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.  సేకరించిన వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన మధు అనే యువకుడికి హైదరాబాద్‌లో ఉంటున్న  మజ్జి పద్మ(26) అనే యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. ఖమ్మం జిల్లాకు చెందిన పద్మకు  తల్లిదండ్రులు లేకపోవడంతో కొంత కాలం గా హైదరాబాద్‌లో ఉంటుంది. పద్మతో పాటు విజయవాడ కొత్తూరు తాడేపల్లికి చెందిన రాజశేఖర్ అనే యువకుడితో మధుకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఉండేది. పద్మ, మధుల మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో విజయవాడకు గురువారం వస్తున్నానని చెప్పిన పద్మను కలుసుకునేందుకు మధు గురువారం నగరానికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి విజయవాడ శివారు కొత్తూరు తాడేపల్లిలోని మామిడి తోటకు వెళ్లారు. జక్కంపూడి, షాబాద్ గ్రామాలకు చెందిన  రాజేష్, మరో ఇద్దరు యువకులు తోటలోకి వచ్చి పోలీసులమంటూ హడావుడి చేశారు. వీరిలో ఒకరు తాను కొత్తపేట ఎస్సైనని బెదిరించాడు. ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నిం చాడు. దీంతో   మధు బెదిరిపోయాడు. అతడి చేతికి ఉన్న బ్రాస్‌లెట్‌తో పాటు మెడలోని గొలుసు, చేతి ఉంగరాలు మొత్తం ఏడు కాసుల బంగారాన్ని బలవంతంగా లాక్కున్నారు. మధు, పద్మ నగరానికి తిరిగివస్తూ మార్గమధ్యంలో ఎదురైన పోలీసులకు విషయం తెలిపారు. వారు వెంటనే రాజేష్‌తో పాటు మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనలో  రాజశేఖర్‌ది కూడా కీలక పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకునేందుకు  పోలీసు బృందం హైదరాబాద్ వెళ్లినట్లు తెలి సింది. ఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత నిందితులను అరెస్టు చూపే అవకాశాలున్నాయని స్టేషన్ అధికారులు పేర్కొంటున్నారు.
 
వెలుగులోకి మరో కోణం...

అయితే ఈ కేసులో మరో కోణం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఉంటున్న రాజశేఖర్, యువతితో కలిసి ఫోన్‌లో మాయమాటలు చెప్పి యువకులను మోసం చేసి బంగారం, డబ్బు గుంజుతున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. అదే రీతిలో గురువారం హైదరాబాద్ నుంచి నగరానికి యువతి బయలుదేరిన విషయాన్ని రాజశేఖర్ తన మిత్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి నకిలీ పోలీసుల రూపంలో బంగారం దోచుకున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసినట్లు తెలిసింది. గతంలో ఇదే తరహాలో మరేమైనా ఘటనలకు పాల్పడ్డారా?   యువతి ఎంత మందిని మోసం చేసిందనే కోణాల్లో కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం.
 

Videos

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

కూటమికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు

కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?