amp pages | Sakshi

19, 20 తేదీల్లో జిల్లాలో జగన్‌ పర్యటన

Published on Tue, 05/16/2017 - 04:56

హిరమండలం: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెల 19, 20 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. హిరమండలంలో ఈనెల 19న ఆయన పర్యటించనున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కోరారు.

 స్థానిక ప్రైవేటు కల్యాణ మండపంలో సోమవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ నాయకులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంశధార నిర్వాసితులను ఆదుకున్న నాయకుడు వైఎస్‌ రాజశేఖర రెడ్డి మాత్రమేనని, టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిర్వాసితులను క్షోభ పెడుతోందని తెలిపారు.

 అందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాసితుల కన్నీళ్లు తుడవడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా బహిరంగ సభ కోసం స్థల పరిశీలన కూడా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అల్లు కృష్ణారావు, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, ఐదు మండలాల పార్టీ కన్వీనర్లు శంకర్‌రావు, త్రినాథరావు, ప్రసాద్, షన్ముఖరావు, నాయకులు మురళి, కన్నయ్య, సత్యన్నారాయణ, రవివర్మ, నరేష్, కొల్ల కృష్ణ  పాల్గొన్నారు.   

కన్నీళ్లు తుడవడానికే..
శ్రీకాకుళం అర్బన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ప ర్యటన ద్వారా వంశధార నిర్వాసితులను, ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ రోగులను కలసి వారి సమస్యలను తెలుసుకుంటారని రెడ్డి శాంతి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ హ యాంలో వంశధార ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారని, కానీ ఆయన మరణం తర్వాత ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆమె ఆరోపించారు.

 టీడీపీ నాయకులు ప్రాజెక్టు నిర్మాణంపై కనీస శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో కనీస నిధులు కూడా కేటాయించలేదన్నారు. ప్రాజెక్టు పరిధిలో 29 గ్రామాలు ఉండగా వారెవ్వరికీ ఎలాంటి ప్యాకేజీ ఇ వ్వలేదన్నారు. గత ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన పాతపట్నం ఎమ్మెల్యే కలమట తన స్వలాభం కోసం పార్టీ ఫిరాయించి టీడీపీలోకి చేరారని మండిపడ్డారు.

వంశధార ప్రాజెక్టు నిర్మాణం వల్ల పునరావాసం లేకుండా, నష్టపరిహారం అందకుండా 8 వేల కుటుం బాలు రోడ్డున పడ్డాయని చెప్పారు. రణస్థలం మండలం కొవ్వాడ ప్రాంతంలో నిర్మించనున్న అణుప్రాజెక్టు కోసం ఆ ప్రాంతంలో భూసేకరణ చేపడితే అక్కడి వారికి ఎకరాకు రూ. 11లక్షల నుంచి 14లక్షల వరకూ ప్రభుత్వం చెల్లిస్తోం దని, వంశధార ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసిత రైతులకు మాత్రం కంటితుడుపు చర్యగా నగదు చెల్లించడం శోచనీయమన్నారు. వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి వంశధార నిర్వాసితులకు అండగా నిలబడతారని తెలిపారు.

 అలాగే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. వైఎస్‌ హయాంలో కిడ్నీ వ్యాధికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక కమిటీని కూడా వేశారని, ఆయన మరణం తర్వాత అది మరుగున పడిందన్నారు. టీడీపీ ప్రభుత్వం కిడ్నీ రోగులకు డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నామమాత్రంగా చర్యలు చేపడుతోందని, జగన్‌మోహనరెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తేనే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)