amp pages | Sakshi

సంతబేరం.. ఎంతఘోరం

Published on Thu, 02/25/2016 - 01:36

కొందరు వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకోవడంపై జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దీనిని సంతబేరంగా అభివర్ణించారు. చంద్రబాబు విలువలకు తిలోదకాలిచ్చి, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కుట్రలు, కుతంత్రాలకు బాబు మారుపేరు అని విమర్శించారు. జిల్లా ప్రజలు ఎవరూ బాబును నమ్మరని తెలిపారు. వైఎస్‌ఆర్ సీపీ శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకోవడంతోనే బాబు పతనం ఆరంభం అయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ను అవకాశవాదిగా పేర్కొన్నారు. -సాక్షి ప్రతినిధి, తిరుపతి
 
బాబుకు విలువలు లేవు
చంద్రబాబుకు నీతినియమాలు, విలువలు లేవు. పక్కా అవకాశ వాది. పదవికోసం ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారు. శవాలపై నడుచుకుంటూ పోయినా పర్వాలేదు, పదవి కావాలనే మనస్తత్వం ఆయనది. పార్టీ ఫిరాయించేవారిది కాదు.. వారిని పార్టీలోకి రమ్మని ప్రోత్సహించడమే తప్పు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి మారుతుంటే ప్రజాస్వామ్య విలువలు ఖూనీ అయ్యాయంటూ గొంతు చించుకుని అరుస్తారు. ఏపీలో మాత్రం అవకాశవాద రాజకీయాలు చేస్తారు. ఎన్టీ రామారావుపైన చెప్పులు వేయించినప్పుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయింది.
 - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే
 
బాబు పతనం ప్రారంభమైంది
మా ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతోనే బాబూ నీ పతనం ప్రారం భమైంది. ఇప్పుడు మీ పార్టీ లో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వ కుం డా ఉంచుకోగలరా? పోనీ మం త్రి పదవులిస్తే మీ పార్టీ సీనియర్లు తిరుగుబాటు చేయరా? ఎన్‌టీఆర్‌ను ఎలా పదవి నుంచి దించారో.. మీకూ అదే గతి పడుతుంది.    - చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే
 
ప్రలోభపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య
ఎమ్మెల్యేలను, నాయకులను ప్రలోభపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 1983లోనే  సమితి ప్రెసిడెంట్‌గా గెలిచిన నాకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి, డబ్బులు ఇస్తానని ఎరవేశారు. ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని అప్పుడే చెప్పాను. ఆయన నైజంలో మార్పు లేదు.  దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిం చి గెలిపించుకో. పార్టీ మారిన వారు చరిత్ర హీనులవుతారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం డబ్బులు లేవనే బాబుకు ఎమ్మెల్యేలను కొనేందుకు ఎక్కడ నుంచి వచ్చాయి? పార్టీని వీడిన ఎమ్మెల్యేలు క్షోభించేరోజు దగ్గరలో ఉంది. పిచ్చివారు కూడా ఇలాంటి పనులు చేయరు.  
 -కె. నారాయణస్వామి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే
 
కుతంత్రాలకు మారుపేరు
చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు మారు పేరు. జిల్లాలో ఆయనను ఎవ్వరూ నమ్మరు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా జిల్లాలోని 8 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడే ప్రసక్తే లేదు. ఎవరైతే పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారో వారిది రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమే. భవిష్యత్తు ఉండదు. ప్రజలు వారిని తిరస్కరిస్తారు.
 -  చింతల రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే
 
హుందాగా వ్యవహరించాలి
ఏ పార్టీలో ఉన్నా ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలి. నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి. ఇలా దిగజారుడుతనంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం ఏపార్టీకీ శ్రేయస్కరం కాదు. పార్టీలు మారే ఎమ్మెల్యేలను ప్రజలు విశ్వసించరు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.   
 -ఎన్.అమరనాథ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే
 
వెన్నుపోటు ఆయన నైజం
 వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. డబ్బులు ఎరగా వేసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి గెలిపించుకోవాలి. ఎస్సీలను తక్కువ చేసి మాట్లాడిన బాబు చివరకు దళిత ఎమ్మెల్యేలను కొనుక్కునే పరిస్థితికి దిగజారారు.  దిగజారిపోయి ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడుపోవద్దు. ‘‘మాకు కోట్లు వద్దు.. రాజన్న, జగనన్న మాపై చూపే ప్రేమ చాలు.. నేను ఎన్నటీకి పార్టీ వీడే ప్రసక్తే లేదు’’.                
  - డాక్టర్ సునీల్‌కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే
 
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)