amp pages | Sakshi

ఎయిర్ కోస్టాలో వాటా విక్రయం!.

Published on Thu, 10/06/2016 - 01:50

విదేశీ ఎయిర్‌లైన్స్‌తో చర్చలు
కొత్త విమానాలకై త్వరలో ఒప్పందం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న ఎయిర్ కోస్టా వాటా విక్రయానికి రెడీ అయింది. గల్ఫ్ ప్రాంతానికి చెందిన విమానయాన సంస్థలతో సహా పలు అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. 26 శాతం వాటా విక్రయానికై ఖతర్ ఎయిర్‌వేస్, ఎయిర్ కోస్టా మధ్య ఇటీవల  చర్చలు జరిగాయి. అయితే ఎటువంటి నిర్ణయానికి ఇరు సంస్థలు రానట్టు తెలుస్తోంది.

ఎయిర్ కోస్టాలో ఎమిరేట్స్, ఎతిహాద్, గల్ఫ్ ఎయిర్‌లలో ఏదో ఒక కంపెనీ వాటా తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా విమానాలను నడిపేందుకు ఎయిర్ కోస్టాకు ఈ నెల 3న డీజీసీఏ లెసైన్సు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వాటా విక్రయానికి ఇదే సరైన సమయమని కంపెనీ భావిస్తోంది. దేశవ్యాప్త లెసైన్సుతో సంస్థ విలువ పెరగడం ఇందుకు కారణం. ఇప్పటి వరకు ప్రాంతీయ విమానయాన సంస్థగా ఉన్న ఎయిర్‌కోస్టా హైదరాబాద్‌సహా 8 నగరాలకు సర్వీసులను నడిపింది.

మరిన్ని విమానాలకై..
ప్రస్తుతం ఎయిర్ కోస్టా వద్ద ఒక్కొక్కటి 110 సీట్ల సామర్థ్యం గల మూడు ఎంబ్రార్ ఇ-190 ఫ్లైట్స్ ఉన్నాయి. ప్రతి రోజు 24 సర్వీసులను నడిపిస్తోంది. ఈ నెలలోనే మరో విమానం తోడవుతోంది. కొత్తగా ఆరు ఎయిర్‌క్రాఫ్ట్స్ కోసం సింగపూర్‌కు చెందిన జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్‌తో అక్టోబరులోనే ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు ఎయిర్ కోస్టా సీఈవో వివేక్ చౌదరి తెలిపారు. 2017 జనవరి నుంచి కంపెనీలోకి వీటి రాక ప్రారంభం అవుతుందన్నారు. వచ్చే ఏడాది డిసెంబరుకల్లా సంస్థ చేతిలో ఎంబ్రార్ ఇ-190 రకం 10 విమానాలు ఉండనున్నాయి. రెండేళ్లలో మొత్తం 18 నగరాల కు సర్వీసులను అందించాలన్నది సంస్థ ప్రణాళిక. ఈ ఏడాది డిసెంబరు నుంచి కొత్త నగరాలను జోడించనుంది.

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)