amp pages | Sakshi

అమెజాన్‌ ‘ఫ్రీడం సేల్‌’ : డిస్కౌంట్లే డిస్కౌంట్లు

Published on Sat, 08/04/2018 - 16:09

ఈ-కామర్స్‌ కంపెనీలు మళ్లీ డిస్కౌంట్లతో మారుమోగించబోతున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ నాలుగు రోజుల సేల్‌కు సిద్ధమైంది. ఆగస్టు 9 నుంచి 12వ తేదీ వరకు ‘ఫ్రీడం సేల్‌’ పేరుతో డిస్కౌంట్లకు తెరలేపుతోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, లార్జ్‌ అప్లియెన్స్‌, టీవీలు వంటి ఉత్పత్తులపై 20వేలకు పైగా డీల్స్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్‌లో వన్‌ప్లస్‌, వివో, జేబీఎల్‌, ఎల్‌జీ, ఫిలిప్స్‌, క్యాసియో వంటి అన్ని రకాల బ్రాండ్లు పాల్గొనబోతున్నాయి. అమెజాన్‌ ఎకో డివైజ్‌లు, ఫైర్‌ టీవీ స్టిక్‌, కిండ్లీ ఈ-రీడర్స్‌ వంటి అన్ని డివైజ్‌లపై అదనంగా గ్రేట్‌ డిస్కౌంట్లను అమెజాన్‌ అందించబోతుంది. వన్‌ప్లస్‌ 6, హానర్‌ 7ఎక్స్‌, రియల్‌మి 1, మోటో జీ6, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8, వివో ఎక్స్‌21, హువావే పీ20 లైట్‌ స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను కూడా ప్రకటించింది. ఈ సేల్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు స్పెషల్‌ డీల్స్‌ను, డిస్కౌంట్లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 

పీసీ యాక్ససరీస్‌పై ప్రైమ్‌ మెంబర్లకు  60 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు అమెజాన్‌ టీజ్‌ చేసింది. మొబైల్‌ ఫోన్లు, యాక్ససరీస్‌పై 40 శాతం వరకు,  రోజువారీ వస్తువులు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌పై 50 శాతం వరకు, ఫ్యాషన్‌ ప్రొడక్ట్‌లపై 50 నుంచి 80 శాతం వరకు, హోమ్‌, అవుట్‌డోర్‌ పరికరాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్‌ చేయనున్నట్టు ప్రకటించింది.భారత్‌లో ఎక్కువగా సందర్శించే షాపింగ్‌ ప్లేస్‌ అమెజాన్‌ అని, ప్రతి పండుగను తమ కస్టమర్లతో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటామని అమెజాన్‌ ఇండియా కేటగిరీ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ తివారీ చెప్పారు. ఈ సీజన్‌లో కస్టమర్లు ఆశించే ప్రతీది తాము ఈ ఫ్రీడం సేల్‌లో ఆఫర్‌ చేస్తామని తెలిపారు. కొత్త ప్రొడక్ట్‌ల లాంచింగ్‌, గ్రేట్‌ డీల్స్‌, ఎక్స్‌ట్రా క్యాష్‌బ్యాక్‌లు, నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్చేంజ్‌ ఆప్షన్లను అందిస్తూ అమెజాన్‌.ఇన్‌ ఈ ఫ్రీడం సేల్‌ను ఘనంగా నిర్వహించనుందని పేర్కొన్నారు.  ఈ ఫ్రీడం సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వాడుతూ ఉత్పత్తులు కొనేవారికి 10 శాతం అదనపు క్యాష్‌బ్యాక్‌ కూడా లభించనుంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌