amp pages | Sakshi

ఆపిల్‌ నుంచి మూడు ఐఫోన్లు..!

Published on Mon, 01/29/2018 - 10:52

టెక్‌ దిగ్గజం ఆపిల్‌.. 2018లో మూడు కొత్త ఐఫోన్లను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. కంపెనీ నుంచి విడుదలయ్యే ఉత్పత్తులపై సరియైన అంచనాలను విడుదల చేసే కేజీఐ సెక్యురిటీస్‌ విశ్లేషకుడు మింగ్‌-చి కుయో ఈ విషయాన్ని వెల్లడించారు. కుయో తాజా రిపోర్టులో ఆపిల్‌ 2018లో ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌, తక్కువ ధరలో 6.1 అంగుళాల అతిపెద్ద డిస్‌ప్లేతో ఐఫోన్‌ ఎక్స్‌ను ప్రవేశపెట్టనుందని తెలిపారు. 

6.1 అంగుళాల ఐఫోన్‌ ఎక్స్‌ను బడ్జెట్‌ ఆప్షన్‌లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇది ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంటుందట. ఈ వెర్షన్‌ కోసం జపాన్‌ డిస్‌ప్లే 70 శాతం ఎల్‌సీడీ ప్యానల్స్‌ను సరఫరా చేసిందని తెలిసింది. ఆల్ట్రా స్లిమ్‌ బెజెల్స్‌లో రూపొందుతున్న ఈ ఫోన్‌కు, ఫేస్‌ ఐడీ, యానిమోజీస్‌ ఉంటాయని తాజా రిపోర్టు పేర్కొంది. 2017 ఐఫోన్‌ ఎక్స్‌ కంటే కూడా పెద్ద బ్యాటరీని ఇది కలిగి ఉంటుందట. అల్యూమినియం ఫ్రేమ్‌, నో 3డీ టచ్‌, సింగిల్‌ రియర్‌ కెమెరా దీనిలో మిగతా ఫీచర్లు. మరికొన్ని అంచనాల ప్రకారం ఈ ఐఫోన్‌ ఎక్స్‌, అచ్చం ఐఫోన్‌ ఎస్‌ఈ2 మాదిరిగా ఉండనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో ఐఫోన్ ఎస్‌ఈ 2 కూడా మార్కెట్‌లోకి వస్తున్నట్టు డిజిటైమ్స్‌ రిపోర్టు సంకేతాలిచ్చింది. 

2018లో రాబోతున్న మిగతా రెండు ఐఫోన్లు ఐఫోన్‌ ఎక్స్‌(2018), ఐఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌లు 6.5 అంగుళాల,  5.8 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉన్నట్టు కూడా కుయో రిపోర్టు చేశారు. ఐఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌కు 4జీబీ ర్యామ్‌, అతిపెద్ద 3300-3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండనున్నాయి. డిజిటైమ్స్‌ రిపోర్టు ఆపిల్‌ ప్రస్తుతం నాలుగు ఐఫోన్‌ మోడల్స్‌పై పనిచేస్తుందని... దానిలో రెండు ఎల్‌సీడీ డిస్‌ప్లే ఫోన్లు కాగ, మరో రెండు ఓలెడ్‌ డిస్‌ప్లేలు కలిగి ఉన్న ఫోన్లని తెలిపింది. కానీ తర్వాత ఈ రిపోర్టు కూడా లాంచింగ్‌కు ఆపిల్‌ మూడు మోడల్స్‌నే పరిమితం చేసిందని అంచనా వేస్తోంది.
 

Videos

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)