amp pages | Sakshi

జైట్లీ ఆస్తి ఎంతో తెలుసా?

Published on Sat, 07/02/2016 - 16:10

గతంలో అందరికంటే అధిక ఆస్తులతో అగ్రస్థానంలో నిలిచిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్  జైట్లీ వ్యక్తిగత ఆస్తుల విలువ  ఈ ఏడాది క్షీణించిందట.  ఈ  వివరాలను అధికారిక పీఎంవో వెల్లడి చేసింది.  2016  ఆర్థిక సం.రానికి గాను  జైట్లీ ఆస్తులు విలువ (8.9 శాతం) 6 కోట్లకు క్షీణించిందని తెలిపింది.  2014-15లో రూ 67. 01 కోట్లుగా   ఉన్న  జైట్లీ వ్యక్తిగత సంపద ,  2015-16 లో రూ 60.99 కోట్లకు  తగ్గిందని తెలిపింది. ఆయన చర,  స్థిర  ఆస్తుల డేటా వివరాలను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా  వెబ్ సైట్ లో  అధికారికంగా వెల్లడించారు.  జైట్లీకి, ఆయన  భార్యకు  ఉమ్మడి ఆస్తిగా  ఆరు(ఢిల్లీ, గుర్గావ్, హర్యానా పంజాబ్ లోని అమృతసర్, గుజరాత్ లోని గాంధీనగర్)  రెసిడెన్షియల్ ఆస్తులు ఉన్నాయి.  దీంతో పాటూ ఢిల్లీలో  కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయని డేటా వెల్లడించింది.  

డేటా వెల్లడించిన వివరాల ప్రకారం  2016  ఆర్థిక సంవత్సరానికిగాను జైట్లీ బ్యాంకు బ్యాలెన్స్ గత ఏడాది రూ 3.52 కోట్ల నుంచి, రూ .1 కోటి వరకు తగ్గింది. . నాలుగు   సేవింగ్స్  ఖాతాలున్నాయని  (హెచ్డీఎఫ్సీలో మూడు,  స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా లో ఒకటి ). 15కేజీల  వెండి,(5.54  కోట్లు) 5.6 కిలోల(1.35కోట్ల)  బంగారం , రూ .45 లక్షలు వజ్రాభరాణాలు ఆయన సంపదలో భాగం.  రెండు మెర్సెడెజ్ బెంజ్,  ఒక హోండా అకార్డ్,  టయోటా ఫార్చ్యూనర్,   ఉండగా ఈ సంవత్సరం 86 లక్షల బీఎండబ్ల్యూ కారుతో కలిపి అయిదుకు చేరాయి.  దీంతోపాటుగా డీసీఎం శ్రీరాం సంస్థలో 8 కోట్లు   ఎంప్రో ఆయిల్స్ కంపెనీల్లో  9 కోట్ల రూపాయల   పెట్టుబడులు ఉన్నాయి.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)