amp pages | Sakshi

ఆడి రూ.10 లక్షల డిస్కౌంట్‌...

Published on Tue, 05/29/2018 - 00:10

న్యూఢిల్లీ: ‘ఆడి’ కారు కొనేవారికి ఇదే సరైన సమయమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ తాజాగా భారత్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై రూ.10 లక్షల వరకు పరిమిత కాల డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ తగ్గింపు జూన్‌ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటుంది.

దిగుమతి సుంకం పెంపు తర్వాత మార్కెట్‌లో తలెత్తిన సవాళ్లను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఏ3, ఏ4, ఏ6 సెడాన్‌ కార్లు సహా క్యూ3 ఎస్‌యూవీపై రూ.2.7 లక్షలు–రూ.10 లక్షల శ్రేణిలో తగ్గింపు పొందొచ్చని తెలిపింది. ‘కస్టమర్లకు కఠినమైన దిగుమతి సుంకాలు, ప్రతికూల పన్ను వాతావరణం వంటివి అడ్డు రాకూడదు. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆడి ఇండియా హెడ్‌ రహిల్‌ అన్సారి చెప్పారు.

పన్ను బాదుడు వల్లే...
2018–19 బడ్జెట్‌లో.. మోటార్‌ వెహికల్స్, మోటార్‌ కార్స్, మోటార్‌ సైకిల్స్‌ కంప్లీట్లీ నాక్‌డ్‌ డౌన్‌ (సీకేడీ) దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. అలాగే కేంద్రం మోటార్‌ వెహికల్స్, మోటార్‌ కార్స్, మోటార్‌ సైకిల్స్‌కు సంబంధించిన ప్రత్యేకమైన విడిభాగాలు, యాక్ససిరీస్‌లపై కూడా కస్టమ్స్‌ డ్యూటీని 7.5% నుంచి 15%కి పెంచింది. ఈ నేపథ్యంలో లగ్జరీ కార్ల కంపెనీలు వాటి వాహన ధరలను రూ.లక్ష నుంచి రూ.10 లక్షల శ్రేణిలో పెంచాయి.

‘2018 కార్ల అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని అంచనా వేశాం. కానీ బడ్జెట్‌లో కస్టమ్స్‌ డ్యూటీ పెంపు వల్ల కార్ల ధరలను పెంచాల్సి వచ్చింది. దీంతో ఈ ఏడాది అమ్మకాలు ఫ్లాట్‌గా ఉండొచ్చు’ అని అన్సారి చెప్పారు.   ‘గతేడాది జీఎస్‌టీ వల్ల అధిక డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేశాం. దీనివల్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. అదే ఫార్ములాను ఇప్పుడూ అనుసరిస్తున్నాం’ అని తెలిపారు. అలాగే ఎంపిక చేసిన మోడళ్లపై 57 శాతం బైబ్యాక్‌ అష్యూరెన్స్‌ పొందొచ్చన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)