amp pages | Sakshi

బిజినెస్‌ క్లాస్‌లో నల్లుల దర్జా..

Published on Sat, 07/21/2018 - 11:51

ముంబై : ఒకప్పుడు రైళ్లు, సినిమా హాళ్లకే పరిమితమైన నల్లులు ఇప్పుడు విమనాలోనూ దర్జా వెలగబెడుతున్నాయి. అది కూడా ఏకంగా బిజినెస్‌ క్లాస్‌లో. నల్లులు ఇంత రాజభోగం అనుభవిస్తున్నది ఎయిర్‌ ఇండియా విదేశీ విమానాల్లో. పాస్‌పోర్ట్‌, వీసా, టికెట్‌లతో పనిలేకుండా దేశ విదేశాలను చుట్టేస్తూ మధ్యలో బోర్‌ కొట్టినప్పుడు తమ ఉనికిని తెలియజేయడానికి ప్రయాణికులను కుడుతూ జల్సా చేస్తున్నాయి. సరిగ్గా గతేడాది ఇదే సమయంలో ఎయిర్‌ ఇండియాలో చిట్టెలుకలు కనిపించి కంగారు పుట్టిస్తే ఇప్పుడు వాటి స్థానాన్ని నల్లులు ఆక్రమించాయి.

న్యూయార్క్‌ - ముంబై ప్రయాణిస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో నల్లులు ఒక చిన్నారిని కుట్టడంతో వీటి ఉనికి బయటపడింది. తర్వాత మరో ఇద్దరు, ముగ్గురిని కూడా కుట్టడంతో ప్రయాణికులు ఆందోళన చేశారు. నల్లులతో కలిసి మేం ప్రయాణించం అని తెల్చి చెప్పడంతో, వాటిని తొలగించి తిరుగు ప్రయాణం ప్రారంభించే సరికి ఢిల్లీకి చేరాల్సిన విమానం కాస్తా ఆలస్యం అయ్యింది. ఈ విషయాన్ని ప్రవీణ్‌ తొన్సేకర్‌ అనే ఒక ప్రయాణికుడు తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. విమానంలో సీట్ల మీద ఉన్న నల్లులను ఫోటో తీసి తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

ఫోటోతో పాటు ‘ఎయిర్‌ ఇండియా సంస్థ, విమానయాన మంత్రి సురేష్‌ ప్రభు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు.. నేను నా కుటుంబంతో కలిసి 144 సీట్లు ఉన్న ఎయిర్‌ ఇండియా బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణం చేస్తున్నాను. మా​​​కు కేటాయించిన సీట్లను మాకంటే ముందుగానే నల్లులు ఆక్రమించుకున్నాయి. ఇన్నాళ్లు రైళ్లలోనే నల్లులు ఉంటాయని విన్నాను. కానీ తొలిసారి విమానంలో, అది కూడా బిజినెస్‌ క్లాస్‌లో వీటిని చూసి షాక్‌ అయ్యాను’ అంటూ మెసేజ్‌ను కూడా పోస్టు చేశారు. ఎకానమీ క్లాస్‌లో అతనికి ఎదురైన అనుభావాల గురించి మరొక ట్వీట్‌లో పోస్టు చేశారు. అక్కడ విరిగిపోయి ఉన్న టేబుల్స్‌ గురించి, సరిగా లేని టీవీల గురించి తెలిపి, దాని వల్ల తన కూతురు, భార్య ఎదుర్కొన్న సమస్యల గురించి తెలిపారు.

ప్రవీణ్‌ చేసిన ట్వీట్‌కు బదులుగా ఎయిర్‌ ఇండియా ప్రతినిధులు రీట్వీట్‌ చేశారు. ‘మీకు కలిగిన అసౌకార్యానికి చింతిస్తున్నాం. మీరు ఇచ్చిన ఫిర్యాదును మేము మా నిర్వహణ విభాగానికి తెలియజేశాం. వీలైనంత త్వరగా ఈ అసౌకర్యాన్ని సరిచేస్తాం’ అని తెలిపారు. గతేడాది ఢిల్లీ - శాన్‌ ఫ్రాన్సిస్కో ప్రయాణిస్తున్న విమానంలో ఎలుక కనిపించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రయాణం 9 గంటలు ఆలస్యం అయ్యింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)