amp pages | Sakshi

బీఎస్‌ఈ.. బంపర్‌ లిస్టింగ్‌

Published on Sat, 02/04/2017 - 00:43

35 శాతం ప్రీమియమ్‌తో రూ.1,085 వద్ద ఓపెన్‌ 
ఇంట్రాడేలో 49 శాతం లాభంతో రూ.1,200 గరిష్ట స్థాయికి 
రూ.1,069 వద్ద క్లోజ్‌


ముంబై: నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌(ఎన్‌ఎస్‌ఈ)లో బీఎస్‌ఈ షేర్లు శుక్రవారం లిస్టయ్యాయి. లిస్టింగ్‌లోనూ, ట్రేడింగ్‌లోనూ బీఎస్‌ఈ షేర్లు మెరుపులు మెరిపించాయి. ఆసియాలో అతి పురాతనమైన, 140 ఏళ్ల చరిత్ర గల బీఎస్‌ఈ షేర్లు ఇష్యూ ధర(రూ.806) తో పోల్చితే 35 శాతం ప్రీమియమ్‌తో రూ. 1,085 వద్ద ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యాయి. ఇంట్రాడేలో 49 శాతం లాభంతో రూ.1,200 గరిష్ట స్థాయికి చేరిన బీఎస్‌ఈ షేర్‌ చివరకు 33 శాతం లాభంతో రూ.1,069 వద్ద ముగిసింది. కోటిన్నర షేర్లు ట్రేడయ్యాయి. సొంత ఎక్సే్చంజ్‌లో లిస్ట్‌ కావడానికి సెబీ నియమనిబంధనలు ఒప్పుకోనందున బీఎస్‌ఈ షేర్లు ఎన్‌ఎస్‌ఈలోనే లిస్టయ్యాయి.

మార్కెట్‌  క్యాప్‌ ఎట్‌ రూ.5,750 కోట్లు
ట్రేడింగ్‌ ముగిసేనాటికి బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5,750 కోట్లుగా ఉంది. ఇక బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ శుక్రవారం ఆల్‌టైమ్‌ రికార్డ్‌ స్థాయి, రూ.115 లక్షల కోట్లకు చేరింది. రూ.805–806 ధరల శ్రేణితో వచ్చిన బీఎస్‌ఈ ఐపీఓ 51 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఏడాది వచ్చిన తొలి ఐపీఓ ఇదే,  అంతేకాకుండా దేశంలోని తొలి స్టాక్‌ ఎక్సే్చంజ్‌  ఐపీఓ కూడా ఇదే.

అతి పెద్ద స్టాక్‌  ఎక్సే్చంజ్‌..
బీఎస్‌ఈ షేర్లు భారీ లాభాలతో ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ కావడం.. మార్కెట్‌ సెంటిమెంట్‌ జోరును సూచిస్తోందని శామ్‌కో సె క్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ చెప్పారు. బీఎస్‌ఈలో దాదా పు 3,000 కంపెనీలు లిస్టయ్యాయి. లిస్టైన కంపెనీల పరంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద స్టాక్‌ ఎక్సే్చంజ్‌ ఇదే. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా చూస్తే పదో స్థానం. ఎన్‌ఎస్‌ఈ షేర్లు తమ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో లిస్ట్‌ కావడం కోసం చూస్తున్నామని బీఎస్‌ఈ చైర్మన్‌ సుధాకర్‌ రావు ఈ సందర్భంగా చెప్పారు. త్వరలో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ కూడా రానున్నది. ఈ ఐపీఓ ద్వారా ఎన్‌ఎస్‌ఈ రూ10,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)