amp pages | Sakshi

 ఇన్ఫోసిస్‌పై సీబీఐ  విచారణ జరిపించండి!

Published on Thu, 11/02/2017 - 20:40

సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్‌టీ పోర్టల్‌  రూపకల్పనలో  దారుణంగా  వైఫ్యలం చెందిదంటూ   దేశీయ  రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌పై ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్  మండిపడుతోంది.    జీఎస్‌టీ పోర్టల్‌ వైఫ్యలం కారణంగా మంచి  పన్నుల వ్యవస్థ అయిన జీఎస్‌టీకి   చెడ్డ పేరు వస్తోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో  ఇన్ఫోసిస్‌, సంబంధిత సంస్థలపై సీబీఐతో   దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ వైఫల్యంపై  ఇన్ఫీ వివరణ ఇవ్వాలని కోరింది. జిఎస్టి పోర్టల్‌కు సంబంధించిన సాంకేతిక, ఇతర అంశాలపై  థర్డ్‌ పార్టీ ఆడిట్ను డిమాండ్ చేయడంతోపాటు  జిఎస్టి పోర్టల్ హోదాలో  వైట్‌ పేపర్‌  విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. 

భారీ పెట్టుబడి, సమయం కేటాయించినప్పటీ​ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌  (జీఎస్‌టీ)  పోర్టల్‌ను  ఇన్ఫోసిస్‌ , ఇతర సంస్థలు  సక్రమంగా రూపొందించలేదంటూ  సియాట్‌  ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ అంశంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరింది.  అస్తవ్యస్తంగా ఉన్నఎస్‌టీ పోర్టల్‌తొ ట్రేడర్లు విసుగు పోతున్నారని  సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండెల్వాల్  ఆరోపించారు.   దీంతో  జీఎస్‌టీ లాంటి పన్ను విధానంపై అటు వ్యాపార వర్గాల్లో, ఇటు వాటాదారుల్లో బ్యాడ్‌ ఇమేజ్‌ వస్తోందన్నారు. ఇన్ఫోసిస్  వైఫల్యం కారణంగా రిటర్న్‌ దాఖలు చేయడంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. పోర్టల్  నిర్వహణ ఇన్ఫోసిస్ పరిధిలో ఉంది, బాధ్యతను పరిష్కరించాల్సిన అవసరం  ఉందని ఖండెల్వాల్  చెప్పారు.

మరోవైపు జీఎస్‌టీ పోర్టల్‌ వైఫ్యలం ఆరోపణలపై    జీఎస్‌టీఎన్‌ సీఈవో ప్రకాష్‌ కుమార్‌ స్పందించారు.  జీఎస్‌టీ నెట్‌ వర్క్‌ పటిష్టంగా  లేకపోతే.. మూడు నెలల కాలంలో 2.26 కోట్ల రిటర్న్స్‌ దాఖలయ్యాయనీ, 64.41 లక్షలవపన్ను చెల్లింపుదారులు  జీఎస్‌టీఎన్‌ లోకి మారడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.  అటు   ట్రేడర్స్‌ బాడీ ఆగ్రహం వార్తలను ఇన్ఫోసిస్‌ తీవ్రంగా ఖండించింది. 

#

Tags

Videos

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)