amp pages | Sakshi

రేట్ల కోత ఆశలపై ‘రూపాయి’ నీళ్లు!

Published on Thu, 12/18/2014 - 01:06

ఎస్‌బీఐ సర్వే అంచనా..
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాలసీ రేట్ల కోత ఆశలపై రూపాయి బలహీన ధోరణి నీళ్లు జల్లుతోందని  ఎస్‌బీ సర్వే ఒకటి అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం ఆమోదనీయ స్థాయికి దిగిరావడం, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల తగ్గుదల నేపథ్యంలో... వృద్ధికి ఊతం ఇస్తూ సమీప కాలంలో ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోత నిర్ణయం తీసుకోవచ్చని ఇటీవల అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ సర్వే వెలువడింది. రూపాయి బలహీనత వల్ల వడ్డీరేట్ల కోత నిర్ణయంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు నివేదికలో ఎస్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువ 63.62 వద్ద ఉంది.
 
త్వరలోనే బలపడుతుంది...
అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్(క్యాడ్) తగిన స్థాయిలో ఉండడం వల్ల రూపాయి తిరిగి సాధ్యమైనంత త్వరలోనే బలపడుతుందని కూడా నివేదిక అభిప్రాయపడింది. క్రూడ్ ఆయిల్ ధరలు దిగువ శ్రేణిలో కదలాడుతున్న పరిమాణం వాణిజ్యలోటు సమతౌల్యతపై ఒత్తిడిని తగ్గిస్తుందని తెలిపింది. 2014-15లో దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంకన్నా 3.7 శాతం అధికంగా 483.4 బిలియన్ డాలర్లుగా ఉంటాయన్నది అంచనా అని ఎస్‌బీఐ చీఫ్ ఎకనమిస్ట్ సౌమ్యకంటి ఘోష్ పేర్కొన్నారు.

కాగా అంతర్జాతీయ అంశాలు భారత్ స్థూల ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించింది. చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనత, రూబుల్ మారకం విలువను రక్షించుకోడానికి రష్యా హఠాత్తుగా పెంచిన వడ్డీరేటు వంటి అంశాలు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రతికూలాంశాలని ఎస్‌బీఐ సర్వే నివేదిక తెలిపింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌