amp pages | Sakshi

క్యూ2లో చైనా వృద్ధి 6.9%

Published on Tue, 07/18/2017 - 01:29

6.5 శాతం లక్ష్యం కన్నా అధికం
బీజింగ్‌: ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.9 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. ఇది ప్రభుత్వం లక్యంగా నిర్దేశించుకున్న 6.5 శాతం కన్నా అధికం. ఈ నేపథ్యంలో అధిక రుణభారం ఉన్నప్పటికీ.. 2017 వృద్ధి లక్ష్యాలను చైనా సునాయాసంగా అధిగమించగలదని పరిశీలకులు భావిస్తున్నారు. దాదాపు తొలి త్రైమాసికం స్థాయిలోనే రెండో త్రైమాసికంలోనూ వృద్ధి నమోదైంది. తమ ఎకానమీ సముచిత శ్రేణిలో స్థిరమైన వృద్ధి రేటు సాధిస్తున్నామని చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌బీఎస్‌) ప్రతినిధి జింగ్‌ జిహాంగ్‌ తెలిపారు.

వార్షిక వృద్ధి లక్ష్యం సాధన దిశగా పటిష్టమైన పునాది ఏర్పడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తాజా గణాంకాల నేపథ్యంలో చైనా క్యూ3 వృద్ధి అంచనాలను గతంలో పేర్కొన్న 6.6 శాతంనుంచి 6.8 శాతానికి, వార్షిక వృద్ధిని 6.7 శాతం నుంచి 6.8 శాతానికి పెంచుతున్నట్లు నొమురా సెక్యూరిటీస్‌ ఒక నివేదికలో పేర్కొంది. అటు ప్రాపర్టీ రంగంలో మందగమనం, దేశీయంగా డిమాండ్‌ తగ్గే అవకాశాలు, అంతర్జాతీయంగా డిమాండ్‌పై అనిశ్చితి నెలకొన్నందున వృద్ధి క్రమంగా మందగించవచ్చన్న అంచనాలు కొనసాగవచ్చని తెలిపింది. జనవరి నుంచి జూన్‌ మధ్య కాలంలో చైనాలోని పట్టణప్రాంతాల్లో సుమారు 73.5 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఇది గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,80,000 అధికం. గతేడాది కన్నా పది లక్షలు అధికంగా ఈ ఏడాది దాదాపు 1.1 కోట్ల మేర ఉద్యోగాలు కల్పించాలని చైనా నిర్దేశించుకుంది.

Videos

కూటమితో లాభం లేదు..

సీఎం జగన్ ఈరోజు షెడ్యూల్

బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై పచ్చ రౌడీలు దాడి..

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు