amp pages | Sakshi

వానలోనూ కారు బేఫికర్‌!

Published on Mon, 10/23/2017 - 01:32

దేశవ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. ఇటీవలే ముంబై, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కొన్ని ప్రాంతాలు నీట మునగటాన్ని చూశాం. హైదరాబాద్‌లో గచ్చిబౌలి, హైటెక్‌సిటీ వంటి ప్రాంతాల్లో కార్లు పూర్తిగా మునిగిపోయిన ఘటనలూ ఎదురయ్యాయి. నిజానికిలాంటి సమయాల్లో వాహనాలకు కలిగే నష్టం అనూహ్యం. లక్షలు పోసి కొన్న కారుకు పూర్తి రక్షణ కల్పించుకునేందుకు ఎన్నో పాలసీలున్నాయి.


వర్షాలకు వాహనం నీట మునిగితే ఇంజిన్‌ పనిచేయకుండా పోయే ప్రమాదముంది. అంతేకాదు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లతో ప్రమాదాల ముప్పూ ఎక్కువే. వర్షాలప్పుడు రోడ్లు స్పష్టంగా కనిపించకపోవటం వల్లో, తడితో జారిపోవటం వల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. నీరు ఇంజిన్‌లోకి ప్రవేశించడం వల్ల కారు నిలిచిపోవటమూ జరుగుతుంటుంది. ఇలాంటి నష్టాల నుంచి రక్షణ కోసం బీమా కంపెనీలు యాడ్‌ ఆన్‌ పాలసీలు అందిస్తున్నాయి.

దీంతో ఈ విషయంలో ఆందోళన చెందక్కర్లేదు. ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ తీసుకుంటే ఇంజిన్‌లోకి నీరు వెళ్లడం వల్ల జరిగే నష్టానికీ పరిహారం లభిస్తుంది. దీంతోపాటు వారంలో అన్ని రోజులూ ఏ సమయంలోనైనా కాల్‌ చేస్తే రోడ్డుపై వాహనం నిలిచిన చోటకే వచ్చి సాయం అందించే సదుపాయం, పరిహారం కోసం దరఖాస్తు చేస్తే కోత పెట్టకుండా పూర్తిగా చెల్లించే పాలసీలూ ఉన్నాయ. కాబట్టి కారుకు బీమా తీసుకునే ముందు పాలసీలో ఈ విధమైన ప్రయోజనాలు ఇన్‌బిల్ట్‌గా ఉన్నదీ, లేనిదీ విచారించుకోవాలి. లేకపోతే యాడ్‌ ఆన్‌ పాలసీలు తీసుకోవచ్చు.


టెలిమ్యాటిక్స్‌ టెక్నాలజీ
టెక్నాలజీ రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. దీంతో కొన్ని బీమా కంపెనీలు వినూత్నమైన పరిష్కారాలను అందిస్తున్నాయి. టెక్నాలజీ సాయంతో ప్రమాదాలకు అవకాశాలను తగ్గించడమే కాకుండా, క్లెయిమ్‌ పరిష్కారాల ప్రక్రియను సులభతరం చేస్తున్నాయి.

టెలిమ్యాటిక్స్‌ టెక్నాలజీ సాయంతో కారు ఇంజిన్, బ్యాటరీ స్థితిగతులను పర్యవేక్షించడం, డ్రైవింగ్‌ తీరు గురించి కాలానుగుణంగా డ్రైవర్‌కు ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వటం, వాహన నిర్వహణ, లొకేషన్, మార్గం, వేగం ఇలా భిన్న రకాల సమాచారాన్ని అప్‌డేట్స్‌గా అందిస్తున్నాయి. ఈ విధమైన చర్యలతో కారును ఫిట్‌గా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ కార్‌ బ్రేక్‌డౌన్‌ అయితే టెలిమ్యాటిక్స్‌ పరికరంలోని జీపీఎస్‌ సాయంతో బీమా కంపెనీ వెంటనే మరో వాహనాన్ని అక్కడికి
పంపిస్తుంది.


క్లెయిమ్‌లకు డిజిటల్‌ పరిష్కారం
వర్షాకాలంలో బీమా కంపెనీలకు వచ్చే క్లెయిమ్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటిలో 70 శాతం పరిహారం కోసం వచ్చే దరఖాస్తులన్నీ ఓన్‌ డ్యామేజీ (స్వయంగా నష్టం) విభాగంలో రూ.20,000లోపు ఉంటున్నవే. కారు కొనుగోలు ధరతో పోలిస్తే ఇది చిన్న మొత్తమే కావచ్చు. కానీ పాలసీ లేకపోతే ఈ చిన్న మొత్తాలే నెలవారీ బడ్జెట్‌ను ఖాళీ చేసేస్తాయి.

క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు, ముఖ్యంగా చిన్న మొత్తాల్లోని క్లెయిమ్‌ దరఖాస్తుల పరిష్కారానికి బీమా కంపెనీలు మోటారు బీమా పాలసీదారుల కోసం స్వయం మదింపు టూల్స్‌ను ప్రవేశపెట్టాయి. యాప్స్‌ ఆధారితంగా ఇవి పనిచేస్తాయి.

వాహనానికి నష్టం వాటిల్లినప్పుడు దాని తాలుకూ ఫొటోలు, ప్రమాద సమాచారాన్ని, పాలసీ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలను ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. యాప్‌ ద్వారా వచ్చిన వివరాల్ని బీమా కంపెనీ ఉద్యోగి పరిశీలించి పరిహారం విషయమై పాలసీదారుడికి సమాచారం అందిస్తారు. సంబంధిత పరిహారం మొత్తాన్ని పాలసీదారుడు అంగీకరిస్తే నిమిషాల్లోనే బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.


సమగ్ర పాలసీ మంచిది...
సమగ్ర మోటారు బీమా పాలసీ అన్నది కీలకమైన ఆర్థిక పెట్టుబడి వంటిది. ప్రమాదం అనంతరం పరిహారం చెల్లించడానికే పరిమితం కాకుండా టెక్నాలజీతో ప్రమాదాలను నియంత్రించే విషయంలో, ప్రమాదం చోటుచేసుకుంటే నష్టం పెద్దదవకుండా పాలసీదారులకు కావాల్సిన సాయాన్ని అందిస్తున్నాయి. కనుక వర్షాల సమయంలో మీ వాహనానికి ఉన్న రిస్క్‌లను దృష్టిలో ఉంచుకుని అందుకు రక్షణ కల్పించే సమగ్ర పాలసీ తీసుకోవడం మంచిది.

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)