amp pages | Sakshi

బ్యాంక్‌ డిపాజిట్లలో ‘ఇంటి’ వాటా ఇంతింత!

Published on Fri, 12/22/2017 - 00:56

ముంబై: పెద్ద నోట్ల రద్దు.. బ్యాంకు డిపాజిట్లలో కుటుంబాల వాటాను దాదాపు రెండు శాతం పెంచింది. రిజర్వ్‌ బ్యాంక్‌ గురువారం విడుదల  చేసిన  గణాంకాలు చూస్తే... 
ౌ 2015–16లో మొత్తం సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లలో కుటుంబాల వాటా 61.5 శాతం. అయితే ఇది 2016–17లో 63.2 శాతానికి చేరింది. అంటే కుటుంబాల బ్యాంకింగ్‌ డిపాజిట్ల వాటా ఈ కాలంలో దాదాపు 2 శాతం (200 బేసిస్‌ పాయింట్లు) పెరిగిందన్నమాట. 2016 నవంబర్‌ 8న  పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.  

►ఇక ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిపాజిట్లలో 11.20 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో ఇది 1,09,43,700 కోట్లు. ఇందులో కేవలం కుటుంబ డిపాజిట్ల పరిమాణం చూస్తే... రూ.69,13,900 కోట్లు. 2015–16తో పోల్చితే ఈ సంఖ్య విషయంలో 14.14 శాతం వృద్ధి నమోదయ్యింది.  

►వ్యక్తిగతంగా చూస్తే, సేవింగ్స్‌ డిపాజిట్లు గణనీయంగా పెరిగాయి. ఈ విలువ 30 శాతం వృద్ధితో రూ.26,78,200 కోట్లకు ఎగసింది. వ్యక్తిగతంగా దాదాపు 70 శాతం మంది సేవింగ్స్‌ డిపాజిట్స్‌నే ఎంచుకున్నారు. ఇది గతానికన్నా భిన్నమైన ధోరణి.   

►కుటుంబ డిపాజిట్లతో పాటు, ప్రభుత్వ రంగాల నుంచి డిపాజిట్లూ పెరిగాయి. అయితే ఫైనాన్షియల్, విదేశీ డిపాజిట్లలో మాత్రం క్షీణత నమోదయ్యింది.  

►రాష్ట్రాల వారీగా మొత్తం డిపాజిట్ల వాటాను చూస్తే, మొత్తం డిపాజిట్లలో 20.4 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 10 శాతం వాటాతో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ద్వితీయ స్థానంలో ఉంది.  

►ఒక్క కుటుంబ డిపాజిట్ల వృద్ధిని చూస్తే, ఉత్తరప్రదేశ్‌ 12.7%తో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంల్లో మహారాష్ట్ర (9.5%), బెంగాల్‌ (8%) గుజరాత్‌ (7.1%) నిలిచాయి.  

Videos

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)