amp pages | Sakshi

ఒడిదుడుకుల వారం!

Published on Mon, 09/21/2015 - 03:48

డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు
- విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి కదలికలు ప్రభావం చూపుతాయ్
- ఈ వారం మార్కెట్‌పై నిపుణుల విశ్లేషణ
న్యూఢిల్లీ:
ఈ వారంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగుతుందని విశ్లేషకులంటున్నారు. బక్రీద్ సందర్భంగా శుక్రవారం సెలవు అయినందున ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం కావడం, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు దీనికి కారణాలని వారంటున్నారు. రూపాయి కదలికలు, అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ట్రెండ్ ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణుల అంచనా. ఈ వారంలో ఎలాంటి ప్రధాన గణాంకాలు వెల్లడి కావని, ఈ గురువారం  డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ట్రేడర్లు తమ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్లను రోల్ ఓవర్ చేయడం, అన్‌వైండ్ చేయడం వంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని  రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు.

వర్షపాత వివరాలపై అప్‌డేట్స్, రూపాయి గమనం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతాయని, ట్రేడర్లు ఈ విషయాలను గమనంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్ తదితర అంశాలపై స్టాక్ మార్కెట్ సూచీల గమనం ఆధారపడి ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు.  వచ్చే వారం(29న) వెలువడే ఆర్‌బీఐ పాలసీపై అంచనాలు  సమీప భవిష్యత్తులో మార్కెట్ ను నిర్దేశించవచ్చని అన్నారు.
 
గతవారం మార్కెట్...

గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 609 పాయింట్లు లాభపడి 26,219 పాయింట్లకు చేరింది.  వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడ్ నిర్ణయం ముగియడంతో ఇక ఇన్వెస్టర్లు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి సమస్యలపై దృష్టి సారిస్తారని నిపుణులంటున్నారు.
 
ఈ నెలలో రూ.4,610 కోట్ల నిధులు వెనక్కి..
వివిధ దేశీయ, అంతర్జాతీయ అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఈ నెలలో ఇప్పటిదాకా రూ.4,610 కోట్ల పెట్టుబడులను నికరంగా ఉపసంహరించుకున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)