amp pages | Sakshi

ఇన్వెస్ట్‌మెంట్స్‌కి యులిప్స్ బెస్ట్...

Published on Sun, 10/26/2014 - 02:15

స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతుండటంతో రిటైల్ ఇన్వెస్టర్లు తిరిగి ఈక్విటీ పెట్టుబడుల వైపు దృష్టిసారిస్తున్నారు. దీంతో యూనిట్ ఆధారిత బీమా పథకాలు (యులిప్స్)కి డిమాండ్ పెరుగుతోంది. ఐఆర్‌డీఏ చార్జీలను తగ్గించడంతో మ్యూచువల్ ఫండ్స్ కంటే యులిప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నారు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ త్రిపాఠి. యులిప్స్ పథకాల్లో ఉన్న ప్రయోజనాలపై ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ..
 
ఆర్థిక రక్షణ కోసమే బీమా అనే భావన తొలగి ఒక ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా చూడటం మొదలు పెట్టారు. అటు బీమా రక్షణతో పాటు దీర్ఘకాలిక పొదుపు, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి, పన్ను మినహాయింపు సాధనాలుగా బీమా పథకాలను చూస్తున్నారు. యులిప్స్ పథకాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఆర్థిక లక్ష్యాలను చేరుకునే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగా యులిప్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఇన్వెస్టర్లకు అవసరాలకు అనుగుణంగా ఈ పథకాలుండటం వీటిలోని మరో ప్రత్యేకత. ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యం అధారంగా ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకునే సౌలభ్యాన్ని యులిప్స్ కల్పిస్తున్నాయి. యులిప్స్ పనితీరు ఇంచుమించు మ్యూచువల్ ఫండ్ పథకాలే ఉన్నా... బీమా రక్షణ, ఫ్లెక్సిబిలిటీ వంటివి అదనపు ఆకర్షణలు.
 
 

తగ్గిన చార్జీలు- పెరిగిన రాబడి
యులిప్స్‌పై నిర్వహణ వ్యయాలను తగ్గిస్తూ 2010లో ఐఆర్‌డీఏ నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు యులిప్స్ రాబడులు పెరిగాయి. గతంలో యులిప్స్‌పై చార్జీలు అధికంగా ఉండటం, తక్కువ కాలానికి ఇన్వెస్ట్ చేయడం, అదే సమయంలో మార్కెట్లు పతనం కావడంతో ఇన్వెస్టర్లకు చేదు అనుభవాలను మిగిల్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఐఆర్‌డీఏ యులిప్స్ చార్జీలను తగ్గించడంతో పాటు దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగా తీర్చిదిద్దింది. ఇప్పు డు యులిప్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కనీసం ఐదేళ్లు వేచి చూడాలి. అలాగే ఇప్పుడు మరికొన్ని కంపెనీలు ఆన్‌లైన్ ద్వారా మరింత చౌకగా యులిప్స్ పథకాలను అందిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో వసూలు చేసే చార్జీల కంటే తక్కువ రేటుకే ఆన్‌లైన్ యులిప్స్ లభిస్తుండటం విశేషం.
 
అధిక సౌకర్యం..
అవసరాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలను మార్చుకునే సౌలభ్యం ఉండటం యులిప్స్‌లోని మరో ప్రధానమైన ఆకర్షణ. సాధారణంగా ఇతర పెట్టుబడి సాధనాల్లో ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాని యులిప్స్‌లో రిస్క్ సామర్థ్యం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎటువంటి రుసుములు లేకుండానే పెట్టుబడులను ఒక దానిలోంచి మరో దానిలోకి మార్చుకోవచ్చు. యులిప్స్‌లోని మరికొన్ని ప్రధానమైన ఆకర్షణలను ఇప్పుడు పరిశీలిద్దాం..
* యులిప్స్‌లో ఈక్విటీ, డెట్, బ్యాలెన్స్‌డ్ వంటి పేర్లతో అనేక ఫండ్స్ అందుబాటులో ఉంటాయి. మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.
* మీ అవసరాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి మారొచ్చు. చాలా బీమా కంపెనీలు ఉచితంగా మారడానికి అనుమతిస్తున్నాయి.
* మధ్యలో నగదు అత్యవసరం అయినప్పుడు కొంత మొత్తం వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.
* అలాగే మీ దగ్గర అధిక నగదు ఉంటే రెగ్యులర్‌గా చెల్లించే ప్రీమియానికి అదనంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
* బీమా రక్షణ ఎంత కావాలన్నది కూడా మీరే నిర్ణయించుకోవచ్చు.
 
ఎలా విభిన్నమైనవి?
మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఈక్విటీ, డెట్, బ్యాలెన్స్‌డ్ వంటి అనేక పథకాలు అందుబాటులో ఉండటంతో యులిప్స్ ఎలా విభిన్నమైనవన్నది అందరికీ వచ్చే మొదటి అనుమానం. మ్యూచువల్ ఫండ్స్‌లో అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నా యులిప్స్ అదనపు సౌలభ్యాన్ని కలిగి ఉన్నాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం?
 సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ, లేదా డెట్ పథకాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయగలం. అలాగే మధ్యలో ఈక్విటీ నుంచి డెట్‌కి డెట్ నుంచి ఈక్విటీకి మారలేం. ఒక వేళ మారాలంటే ఈ పథకం నుంచి పూర్తిగా వైదొలగి కొత్తగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అదనపు చార్జీలతోపాటు, ట్యాక్స్ ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది. కాని యులిప్స్‌లో అలా కాదు.

ఒకేసారి ఈక్విటీ లేదా డెట్ లేదా రెండింటిలో కొంత చొప్పున ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఒకే పథకంలో మీరు అన్ని రకాల ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి యులిప్స్ అనుమతిస్తాయి. అంతేకాదు మధ్యలో ఎటువంటి ఎగ్జిట్ పెనాల్టీలు చెల్లించకుండానే ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి మారొచ్చు. మార్కెట్లో ఉండే ఒడిదుడుకులకు అనుగుణంగా మీ పెట్టుబడులను మార్చుకోవచ్చు. మార్కెట్లు పెరుగుతున్న సమయంలో ఈక్విటీలకు అధికంగా కేటాయించి, రిస్క్ పెరిగిన తర్వాత లాభాలను కాపాడుకోవడానికి వాటిని డెట్ పథకాల్లోకి మార్చుకోవచ్చు. అలాగే వడ్డీరేట్ల కదలిక ఆధారంగా వచ్చే ప్రయోజనాలను కూడా ఒక ఫండ్‌లోంచి మరో ఫండ్‌లోకి మారడం ద్వారా పొందొచ్చు. కానీ చివరగా, యులిప్స్ అనేది దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ పథకం. స్వల్ప కాలిక లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇందులో ఇన్వెస్ట్ చేయండి.

Videos

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌