amp pages | Sakshi

టిక్‌టాక్‌ ప్రో పేరిట మెసేజ్‌ వచ్చిందా?

Published on Mon, 07/06/2020 - 17:12

న్యూఢిల్లీ : దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 59 చైనీస్‌ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆప్‌ స్టోర్‌లలో ఈ యాప్‌లను తొలగించారు. నిషేధానికి గురైన యాప్‌లలో ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ ఒకటి. ఈ నేపథ్యంలో యువతలో ఆ యాప్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని సైబర్‌ నేరగాళ్లు కొత్త రకం మోసానికి తెరతీశారు. టిక్‌టాక్‌ పేరిట మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపుతూ  యూజర్లను బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మెసేజ్‌లలో అమాయక ప్రజలను నమ్మించేలా.. ‘మరోసారి టిక్‌టాక్‌ వీడియోలను ఎంజాయ్‌ చేయండి.. క్రియేటివ్‌ వీడియోలను రూపొందించండి. ఇప్పుడు టిక్‌టాక్‌.. టిక్‌టాక్‌ ప్రో గా అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్‌ చేయడం కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి’ అని రాసి ఉంటుంది.(చదవండి : టిక్‌టాక్‌ బ్యాన్‌ : ‘రీల్స్‌’ వచ్చేసిందిట!)

ఆసక్తితో ఆ లింక్‌ క్లిక్‌ చేసినవారికి సదరు యాప్‌ ఐకాన్‌ అచ్చం టిక్‌టాక్‌ మాదిరిగానే కనిపిస్తోంది. దాని డౌన్‌లోడ్‌ చేసుకున్న వెంటనే అది కెమెరా, మైక్‌ లాంటి ఇతర అనుమతులు అడుగుతుంది. ఆ తర్వాత ఆ యాప్‌ పనిచేయదు. ఫోన్‌లోనే ఉంటుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేని ఇటువంటి యాప్‌లను ఏపీకే ఫార్మట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఫోన్‌లోని డేటా చోరికి గురయ్యే అవకాశం ఉంది. వీటి ద్వారా ఫోన్లలో ఉన్న ఇతర సోషల్‌ మీడియా యాప్‌ల లాగిన్‌ సమాచారం చోరికి గురవుతందని సైబర్‌ నిపుణులు చెప్తున్నారు.అలాంటి మెసేజ్‌లను పట్టించుకోకపోతే మంచిదని హెచ్చరిస్తున్నారు. ఇటీవల వినియోగదారుల ఫేస్‌బుక్‌ లాగిన్‌ వివరాలు చోరిపై ఫ్రెంచ్‌కు చెందిన సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ హెచ్చరికతో.. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 25 హానికర యాప్స్‌ను తొలగించింది. (చదవండి : భారతీయులు డేటా ఎక్కడ ఉందో చెప్పిన టిక్‌టాక్‌!)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)