amp pages | Sakshi

ఇంటి అందం రెట్టింపు!

Published on Fri, 09/16/2016 - 23:05

విపణిలోకి ఐ మార్బుల్ టైల్స్
మార్బుల్స్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగం
నాణ్యత ఎక్కువ.. నిర్వహణ తక్కువ

ఐ మార్బుల్స్, నానో, స్టోన్ ఆర్ట్, డీ క్రిస్టల్, ఎలిగెంటా.. అరే ఏంటివి అనుకుంటున్నారా? అదేనండి మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న లేటెస్ట్ టైల్స్! కలల గృహాన్ని మరింత అందంగా.. ఆనందంగా తీర్చిదిద్దేవి కూడా టైల్సే. దాదాపు 20 దేశాలకు చెందిన టైల్స్.. 700లకు పైగా రకాలతో టైల్స్ హబ్‌గా మారింది హోమ్ 360 డిగ్రీ.. ఇటీవలే దశాబ్దం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ శ్రీనాథ్ రాఠి, జీఎం కె. శారదలు‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

సాక్షి, హైదరాబాద్ :  ఎవరికి వారు తమ ఇళ్లు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుం టారు. వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా ట్రెండ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉత్పత్తులను పరిచయం చేయాల్సి ఉంటుంది. అలాగనీ కేవలం ఎగువ మధ్యతరగతి ప్రజలకే సేవలు పరిమితం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మా దగ్గర సామాన్య తరగతులకు తగ్గట్టూ టైల్స్ ఉన్నాయి. రూ.25 నుంచి ధర ప్రారంభమం టే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత గృహాలకే కాకుండా ఎన్‌సీసీ అర్బన్, వర్టెక్స్, వంశీరాం, వైష్ణవి, ఇన్‌కార్ వంటి వందలాది నిర్మాణ సంస్థలకు టైల్స్‌ను సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం నెలకు 8-10 లక్షల చ.అ. టైల్స్‌ను విక్రయిస్తున్నాం.

నిట్కో, సొమానీ, సింపోలో, హెచ్‌అండ్‌ఆర్ జాన్సన్ వంటి దేశీయ బ్రాండ్లతో పాటూ జొంగ్యాన్ సెరామిక్స్, న్యూపెర్ల్, యెకాలొన్, సాలొనీ, గ్రుప్పో వంటి స్పానిష్, ఇటలీ, చైనా వంటి విదేశీ బ్రాండ్లు కూడా ఉన్నాయి. సుమారు 700 రకాల టైల్స్ అందుబాటులో ఉన్నాయి. టైల్స్‌తో పాటూ శానిటరీ వేర్, యూపీవీసీ తలుపులు, కిటికీలు కూడా ఉంటాయి.

 విపణిలోకి ఐ మార్బుల్స్ టైల్స్: రోజురోజుకూ దేశంలో మార్బుల్స్ మైన్స్ తగ్గుతుండటంతో మార్కెట్లోకి ఐ మార్బుల్స్ టైల్స్ వచ్చేశాయి. ఇటాలియన్ మార్బుల్స్‌కు ప్రత్యామ్నాయంగా వీటిని వినియోగిస్తున్నారు. నాణ్యత ఎక్కువ.. నిర్వహణ తక్కువగా ఉండటమే వీటి ప్రత్యేకత.

ఇటాలియన్ మార్బుల్స్ మూడేళ్లకు మించి నాణ్యత ఉండవు. పగుళ్లు వచ్చేస్తాయి. తరచూ నిర్వహణ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఐ మార్బుల్స్ నిర్వహణ అవసరం లేదు. నీటిని పీల్చుకునే గుణం వీటి సొంతం. పైగా ఇవి పూర్తిగా పర్యావరణహితమైనవి కూడా.

9 ఎంఎం మందంతో ఉండే ఈ టైల్స్ 8/4, 4/4, 2.5/4 సైజులున్నాయి. 25 రకాల రంగుల్లో లభిస్తాయి. ధర చ.అ.కు రూ.250 నుంచి 600 వరకుంది. ఇవి అహ్మదాబాద్‌లో తయారవుతున్నాయి. ప్రపంచంలోనే మూడో ప్లాంట్, ఆసియాలోనే ఏకైక ప్లాంట్ ఇదే కావటం గమనార్హం.

 నానో, స్టోన్ ఆర్ట్: ఇటీవల మార్కెట్‌కు పరిచయమైన మరోరకం టైల్స్ నానో శ్లాబ్స్.  18 ఎంఎం మందంతో 9/5, 8/5 శ్లాబ్స్ ఉన్నాయి. ఇందులో కేవలం తెలుపు రంగు మాత్రమే ఉంది. ఇవి చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. వాణిజ్య, నివాస సముదాయాల్లో రెండింట్లోనూ వినియోగించుకోవచ్చు. ధర చ.అ.కు రూ.350.

వివిధ దేశాల్లోని స్టోన్స్‌ను వినియోగించడం కూడా ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ప్రకృతి సిద్ధమైన రాళ్లు (స్టోన్ ఆర్ట్) కావటంతో ఇంటి అందం రెట్టింపు అవుతుంది. నార్వే, ఇస్తాంబుల్, కెనడా, అమెరికా, ఆఫ్రికా, టర్కీ వంటి సుమారు 20 దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. ధర చ.అ.కు రూ.600-1,100 వరకుంది. వీటిని ఎక్కువగా ఇండిపెండెంట్ హౌస్, విల్లాల్లో వాడుతుంటారు.

ఎలిగెంటా, డీ క్రిస్టల్: ఒకవైపు గోడకు వేసుకునే ఎలిగెంటా సిరీస్ టైల్స్ కూడా ఉన్నాయి. లివింగ్ రూమ్‌లో ఒక గోడకు వేసుకుంటే గది అందమే మారిపోతుంది మరి. వీటిని ఎక్కువ స్టార్ హోటళ్లలో వినియోగిస్తారు. ధర చ.అ.కు రూ.600-1,100.

పూర్తిగా గ్లాస్‌తో తయారు కావటం డీ క్రిస్టల్ టైల్స్ ప్రత్యేకత. ఈ టైల్స్‌పై మనకు నచ్చిన ఫొటోలను ప్రింట్ చేసుకునే వీలుండటంతో అందరినీ ఆకర్షిస్తుంది. 6 ఎంఎం, 8 ఎంఎం మందంతో 300/600 ఎంఎం నుంచి 600/1,800 ఎంఎం వరకు రకరకాల సైజుల్లో, అన్ని రకాల రంగుల్లో ఉన్నాయి. ధర చ.అ. కు రూ.750-900 వరకుంది.

వీటిని ఎక్కువగా పబ్బులు, రెస్టారెంట్లు, కార్పొరేట్ ఆఫీసుల్లో డెకొరేటివ్ కోసం వాడుతుంటారు. ఇంట్లో అయితే చిన్నపిల్లల గ ది, వంట గది, లివింగ్ రూముల్లో ఉపయోగించొచ్చు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, వేడిని కూడా తట్టుకునే గుణం వీటి సొంతం.

స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com

జీఎం శారద ,సీఎండీ శ్రీనాథ్ రాఠి

 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)