amp pages | Sakshi

ఫేస్‌బుక్‌లో ఫేక్‌ అకౌంట్లు ఎన్నో తెలుసా?

Published on Mon, 02/05/2018 - 10:54

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లు అధికమే. అబ్బాయి పేరు మీద అమ్మాయి, అమ్మాయి పేరు మీద అబ్బాయి.. ఇలా ఫేక్‌ అకౌంట్లు సృష్టించి, యూజర్లను కొందరు తప్పుదోవ పట్టిస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌పై ఎన్ని నకిలీ అకౌంట్లు ఉన్నాయో అని కంపెనీ లెక్కతేల్చింది. దానిలో 2017 డిసెంబర్‌ ముగింపు నాటికి దాదాపు 200 మిలియన్‌ అకౌంట్లు(20 కోట్ల అకౌంట్లు) ఫేస్‌బుక్‌లో నకిలీవని తేలింది. ఈ అకౌంట్లు భారత్‌లోనే అత్యధికంగా ఉన్నాయని ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ వెల్లడించింది. 2017 నాలుగో క్వార్టర్‌ ముగింపు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెలవారీ యాక్టివ్‌ యూజర్లలో సుమారు 10 శాతం డూప్లికేట్‌ అకౌంట్లు కలిగి ఉన్న వారేనని ఫేస్‌బుక్‌ తన వార్షిక రిపోర్టులో తెలిపింది.

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే... భారత్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డూప్లికేట్‌ అకౌంట్ల సంఖ్య ఎక్కువగా ఉందని రిపోర్టు వెల్లడించింది. 2017 డిసెంబర్‌ చివరి నాటికి ఫేస్‌బుక్‌ నెలవారీ యాక్టివ్‌ యూజర్లు 2.13 బిలియన్లుగా ఉన్నారు. 2016 డిసెంబర్‌ చివరితో పోలిస్తే.. ఇది 14 శాతం అధికం. నెలవారీ యాక్టివ్‌ యూజర్ల పరంగా...  2017లో వృద్ధికి ప్రధాన వనరులుగా భారత్‌, ఇండోనేషియా, వియత్నాం ఉన్నాయని  ఫేస్‌బుక్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ యాక్టివ్‌ యూజర్లు కూడా 14 శాతం పెరిగి 1.40 బిలియన్లుగా నమోదయ్యారు. 2016 డిసెంబర్‌లో ఈ సంఖ్య 1.23 బిలియన్లుగా ఉండేది. రోజువారీ యాక్టివ్‌ యూజర్ల పరంగా.. కీలక వనరులుగా కూడా భారత్‌, ఇండోనేషియాలే ఉన్నాయని, అదనంగా బ్రెజిల్‌ కూడా ఈ జాబితాలో ఉందని తెలిపింది. 
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)