amp pages | Sakshi

డిసెంబర్‌కే ద్రవ్యలోటు  112.4 శాతానికి

Published on Tue, 02/05/2019 - 04:33

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును లక్ష్యానికి పరిమితం చేసే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 6.24 లక్షల కోట్లుగా (జీడీపీలో 3.3 శాతం) కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని విధించుకుంది. కానీ, తొమ్మిది నెలలకే, ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ నాటికి జీడీపీలో ద్రవ్యలోటు 112.4 శాతానికి రూ.7.01 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ ఖర్చులు, ఆదాయం మధ్య లోటునే ద్రవ్యలోటుగా పేర్కొంటారు. నిజానికి అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోనూ మొదటి తొమ్మిది నెలల్లో ద్రవ్యలోటు 113.6 శాతంగా ఉండడం గమనార్హం. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.53 శాతంగా ఉంది.

దీన్ని 2018–19లో 3.3 శాతానికి కట్టడి చేయాలని కేంద్రం నిర్ణయించగా, తాజాగా దీన్ని 3.4 శాతానికి (రూ.6.34 లక్షల కోట్లు) సవరిస్తున్నట్టు మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. పలు వర్గాలకు ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాల రూపంలో అదనంగా రూ.20,000 కోట్ల మేర భారం పడనుందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.17.25 లక్షల కోట్ల ఆదాయాన్ని తొలుత అంచనా వేయగా, దీన్ని రూ.17.29 లక్షల కోట్లకు సవరిస్తున్నట్టు మధ్యంతర బడ్జెట్‌ పేర్కొంది. అలాగే సవరించిన అంచనాల మేరకు ప్రభుత్వ వ్యయాలు రూ.24.42 లక్షల కోట్ల నుంచి రూ.24.57 లక్షల కోట్లకు పెరిగాయి. 

Videos

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?