amp pages | Sakshi

గూగుల్ మ్యాప్స్ ప్రామాణికం కాదట!

Published on Fri, 06/23/2017 - 18:07

న్యూఢిల్లీ:  గూగుల్‌ మ్యాప్‌లు 'ప్రామాణికం' కాదని దేశంలోని టాప్‌ సర్వేయర్‌ సర్వే ఆఫ్‌ ఇండియా  ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  ఆ మ్యాప్స్ లో అంత కచ్చితత్వం లేదంటున్నారు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు.  ఎందుకంటే వీటిని ప్రామాణికంగా  ప్రభుత్వ రూపొందించలేదు కాబట్టి గూగుల్‌ మ్యాప్‌ను విశ్వసించవద్దంటూ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన సర్వే ఆఫ్ ఇండియా ఈ వ్యాఖ్యలు చేసింది. 
 
గూగుల్‌ మాప్స్ అథెంటిక్‌ కాదని  జనరల్ ఆఫ్ ఇండియాకు చెందిన స్వర్ణ సుబ్బారావు  వ్యాఖ్యానించారు.దీనికి బదులుగా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఉపయోగించాలని సూచించారు. గూగుల్ మ్యాప్స్ చూసి మోసపోవద్దనిన  ఆయన హెచ్చరించారు.  సర్వే ఆఫ్ ఇండియా (1767) 250 సంవత్సరాలు  పూర్తి చేసుకున్న సందర్భంగా స్టాంపును విడుదలకు నిర్వహించిన  కార్యక్రమంలో ఒక ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. డెహ్రాడూన్‌లోని 250 ఏళ్ల ఇన్స్టిట్యూట్‌ భారతదేశ సర్వే ఆఫ్ ఇండియా తయారుచేసిన పటాలు  అనేక ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఉపయోగించినట్లు ఆమె చెప్పారు. రెస్టారెంట్లు, పార్కులను వెతికే చిన్న, చిన్న పనులకు మాత్రమే ఉపయోగిస్తున్నారని.. ప్రభుత్వం పెద్దగా ఈ మ్యాప్‌లపై ఆధారపడటంలేదని తేల్చి చెప్పారు.   రోడ్ల నిర్మాణం, రైల్వే ట్రాక్‌ల ఏర్పాటు లాంటి కార్యక్రమాల కోసం సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాప్‌లను ఉపయోగిస్తుంటుంది కేంద్రం. ఏది ఏమైనా అభివృద్ధి పనులు సరైన సర్వే తర్వాత మ్యాపింగ్ ప్రారంభించాలని  సూచించారు.

మరోవైపు  సర్వే ఆఫ్ ఇండియా  సహా, గూగుల్ లాంటి వివిధ కంపెనీలు వేర్వేరు ప్రయోజనాల కోసం తయారు చేస్తున్న ఉపగ్రహ మ్యాపింగ్‌లను  తిరస్కరించడం తప్పు అని  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్  సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ  కార్యదర్శి అశుతోష్ శర్మ  చెప్పారు.  భారతదేశ మొట్టమొదటి తపాలా స్టాంప్, భారత రాజ్యాంగం మొదటి కాపీని ముద్రించిన ఘనత సర్వే ఆఫ్‌ ఇండియాకు దక్కుతుందని కమ్యూనికేషన్ సహాయ మంత్రి మనోజ్ సిన్హా  వ్యాఖ్యానించారు. 
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)