amp pages | Sakshi

ఢిల్లీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం

Published on Sat, 06/24/2017 - 12:55

న్యూఢిల్లీ:  గ్రేటర్‌ నోయిడాలో  కొత్త విమానాశ్రయ నిర్మాణానికి  కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నోయిడాలో జెవెర్‌ లో ఈ  కొత్త ఎయిర్‌ పోర్టు నిర్మాణ ప్రతిపాదను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.   నోయిడా ఇంటర్నేషనల్‌ ఎయిర్ పోర్ట్‌ తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.  దీంతో ఢిల్లీ ఎన్‌సీఆర్‌  పరిధిలో ఇది రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం కానుంది. 

గ్రేటర్‌ నోయిడాలో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లభించిందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు శనివారం ప్రకటించారు.  తద్వారా తదుపరి 10-15 సంవత్సరాల్లో సంవత్సరానికి 30-50 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందించనున్నామని చెప్పారు. 3వేల హెక్టార్లలో దీన్ని నిర్మించనున్నట్టు  కేంద్రమంత్రి తెలిపారు.   నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ప్రాంతంలో  తొలిదశలో 1000 హెక్టార్లలో  అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ .20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు.పబ్లిక్‌ అండ్‌ ప్రయివేట్‌ పార్టనర్‌షిప్తో (పీపీపీ) తో దీన్ని నిర్మించనున్న ఈ విమానాశ్రయాన్ని అయిదేళ్లలో పూర్తి చేయనున్నట్టు  చెప్పారు. 
మరోవైపు దేశీయ, అంతర్జాతీయంగా వస్తున్న డిమాండ్‌  నేపథ్యంలో  కార్పోరేట్ హబ్‌ గా  జెవెర్‌  విమానాశ్రయం  నిలవనుందని  ఉత్తర ప్రదేశ్‌ మంత్రి ఎస్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)