amp pages | Sakshi

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పైపైకి..

Published on Tue, 09/18/2018 - 01:59

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భాగ్యనగరిలో ఇళ్ల ధరలు పైపైకి వెళ్తున్నాయి. 2013తో పోలిస్తే 26 శాతం ధర అధికమైందని ప్రాపర్టీ కన్సల్టింగ్‌ కంపెనీ అనరాక్‌ తన నివేదికలో వెల్లడించింది. గతంలో ఇన్వెస్టర్లలో సెంటిమెంటు బలహీనంగా ఉన్నా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పటికీ ధరల్లో పెరుగుదల ఉందని తెలియజేసింది. ‘జనాభాతోపాటు ఐటీ, ఐటీ సర్వీసుల కంపెనీలకు హైదరాబాద్‌ కేంద్రం. నివాసయోగ్యం కూడా. మెగాసిటీగా త్వరితగతిన అవతరణ చెందుతోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు కారణంగా నగరం వెలుపల అభివృద్ధి ఊపందుకుంది. ఈ ప్రయోజనాలను భాగ్యనగరి అందిపుచ్చుకుంది. విభిన్న మార్గాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది’ అని అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌ పూరీ వెల్లడించారు.
 
ఏటా 5 శాతం వృద్ధి..: నివేదిక ప్రకారం 2012–17 కాలంలో హైదరాబాద్‌లో రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లో సగటు ధరలు ఏటా 5 శాతం పెరిగాయి. ఐటీలో ఉద్యోగాలు అధికం కావడంతో మార్కెట్‌ సెంటిమెంటు బలపడింది. దీని కారణంగా ప్రధానంగా వెస్ట్‌ జోన్లో ఇళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. 2016తో పోలిస్తే 2017లో ఇళ్ల విక్రయాల్లో 21 శాతం వృద్ధి నమోదైంది. అమ్మకానికి నోచుకోని (ఇన్వెంటరీ) ఇళ్ల సంఖ్య 2017 నుంచి తగ్గుముఖం పట్టింది.

ఈ విషయంలో దేశంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరి ఉత్తమంగా ఉంది. 2016 రెండో త్రైమాసికంలో ఇన్వెంటరీ 35,560 యూనిట్లు నమోదైంది. 2017 వచ్చేసరికి ఇది 14 శాతం తగ్గింది. 2018 రెండో త్రైమాసికం వచ్చేసరికి మరో 13 శాతం తగ్గింది. 2016 తర్వాత గృహ అమ్మకాల్లో మంచి వృద్ధి సుస్పష్టంగా ఉంది. భారీ పెట్టుబడుల రాక, మౌలిక వసతులు మెరుగు పడడంతో హైదరాబాద్‌కు పునరుజ్జీవం వచ్చిందని  నివేదిక పేర్కొంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌