amp pages | Sakshi

భారీగా దెబ్బతిన్న ఐటీ ఇండస్ట్రి

Published on Fri, 06/16/2017 - 17:30

154 బిలియన్ డాలర్ల గల దేశీయ ఐటీ పరిశ్రమ ఇన్ని రోజులు ఓ కలల ప్రపంచంగా ఉండేది. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి ఎక్కడం, ముంచుకొస్తున్న ఆటోమేషన్ ప్రభావం ఐటీ రంగం తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ దెబ్బతో ఉద్యోగాలు భారీగా ఊడటమే కాకుండా.. కొత్త వారికి ఉద్యోగాలు కల్పించడానికి కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయి. అన్ని రంగాల్లో కెల్లా ఐటీ పరిశ్రమలోనే నియామకాల ప్రక్రియ భారీగా దెబ్బతిన్నిందని తాజా అధ్యయన రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. 2017 మే నెలలో ఏడాది ఏడాదికి ఐటీ కంపెనీల నియామకాలు 17 శాతం మేర పడిపోయినట్టు వెల్లడైంది. ఐటీ ఇండస్ట్రిలో నెలకొన్న ఈ పరిస్థితి మరికొంత కాలం పాటు కొనసాగుతుందని తెలిపాయి. ఇతర టెక్ ఉద్యోగాలు బీపీఓ 10 శాతం, టెలికాం 7 శాతం కిందకి పడిపోయినట్టు వెల్లడైంది. నోకరీ.కామ్, ఇన్ఫో ఎడ్జ్ ఇండియా డాక్యుమెంట్ల ఆధారంగా ఈ అధ్యయనాలు వెల్లడయ్యాయి.
 
మొత్తంగా టెక్ పరిశ్రమ భారీగా దెబ్బతిన్నింది కానీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లో నియామకాలు 18 శాతం పడిపోయినట్టు తెలిసింది. కన్ స్ట్రక్షన్ రంగంలో అసలు ఉద్యోగాలే లేవని అధ్యయనం తెలిపింది. అయితే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగ నియామకాలు 8 శాతం, 4  శాతం పెరిగినట్టు తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. ఎక్కువగా కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమల్లో ఆటో ఇండస్ట్రి 20 శాతంతో అత్యధిక రేటు సంపాదించినట్టు తెలిపాయి. మొత్తంగా 2017 మే నెలలో కొత్త ఉద్యోగాల వృద్ధి 4 శాతం నెగిటివ్ గా నమోదైంది. అయితే ఐటీ ఇండస్ట్రిలో నెలకొన్న ఉద్యోగాల కోతపై రీసెర్చ్ సంస్థలు, ఇండస్ట్రి బాడీ భిన్నమైన రిపోర్టులు ఇస్తూ ఎంప్లాయీస్ లో భయాందోళనలు రేపుతున్నాయి. రీసెర్చ్ సంస్థలు భారీగా ఉద్యోగాల కోత ఉంటుందని చెబుతుండగా.. నాస్కామ్ మాత్రం ఆ రిపోర్టులను కొట్టిపారేస్తోంది. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)