amp pages | Sakshi

మైనస్‌లోనే పరిశ్రమలు..!

Published on Sat, 02/13/2016 - 00:09

రెండోనెలా ఐఐపీ తిరోగమనం
డిసెంబర్‌లో 1.3 శాతం క్షీణత

న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి వృద్ధి వరుసగా రెండో నెలా మందగించి మైనస్‌లోనే కొనసాగింది. దీనికి సంబంధించిన సూచీ (ఐఐపీ) డిసెంబర్‌లో అసలు వృద్ధి కనపర్చకపోగా.. 1.3 శాతం క్షీణించింది. ప్రధానంగా తయారీ, యంత్రపరికరాల రంగాల పనితీరు నిరాశాజనకంగా ఉండటమే ఇందుకు కారణమయ్యాయి. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పాదకత మైనస్ 3.4 శాతంగా ఉంది. కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) శుక్రవారం ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం గతేడాది డిసెంబర్‌లో ఐఐపీ 3.6 శాతం వృద్ధి నమోదు చేసింది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తి 3.1 శాతం పెరిగింది. గత సంవత్సరం ఇదే వ్యవధిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2.6 శాతమే. ఇక ఐఐపీలోని వివిధ విభాగాల పనితీరు చూస్తే..
     
♦  యంత్ర పరికరాల ఉత్పాదకత క్షీణతలోకి జారిపోయింది. డిసెంబర్‌లో ఏకంగా 19.7 శాతం తగ్గింది. క్రితం ఏడాది డిసెంబర్‌లో ఇది 6.1 శాతం వృద్ధి నమోదు చేసింది.
   
♦  సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉండే తయారీ రంగం మైనస్‌లో 2.4 శాతం క్షీణించింది. గతంలో 4.1 శాతం వృద్ధి నమోదైంది.
     
క్రితం డిసెంబర్‌లో 1.7 శాతం క్షీణించిన మైనింగ్ రంగం ఈసారి 2.9 శాతం వృద్ధి సాధించింది. విద్యుదుత్పత్తి విభాగం వృద్ధి 3.2 శాతానికి పరిమితమైంది. గతంలో ఇది 4.8 శాతం.


వినియోగ ఆధారిత వర్గీకరణను బట్టి ప్రాథమిక వస్తువుల ఉత్పత్తి స్వల్పంగా 0.5 శాతం మేర పెరిగింది. వినియోగ వస్తువుల తయారీ 0.6 శాతం నుంచి 2.8 శాతానికి పెరిగింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పాదకత మాత్రం మైనస్ 9.2 శాతం నుంచి వృద్ధిలోకి మళ్లి, ఏకంగా 16.5 శాతానికి ఎగిసింది. అయితే, కన్జూమర్ నాన్ డ్యూరబుల్ విభాగం ఉత్పాదకత గతేడాది 5.6 శాతం వృద్ధి కనపర్చగా.. ఈసారి మాత్రం మైనస్ 3.2 శాతంగా నమోదైంది. తయారీ రంగంలోని ఇరవై రెండు పరిశ్రమల గ్రూప్‌లో పది ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.
 

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)